AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: క్రికెటర్ కావాలనుకున్నాడు.. చివరికి గండెపోటుతో మృతి.. సంతాపం తెలిపిన స్టార్ క్రికెటర్లు

దేశంలో క్రికెటర్లకు, ఆ మాటకు వస్తే అంతర్జాతీయంగా కూడా క్రికెటర్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. హాలీవుడ్, బాలీవుడ్‎ను మించి మిలియన్ల కొద్దీ అభిమానులు ఉంటారు. కానీ అలాంటి క్రికెట్ హీరోలకు ఇష్టమైన అభిమానులు కూడా ఉంటారంటే నమ్ముతారా? కానీ ఇది నమ్మి తీరాల్సిన నిజం. గతంలో అనేక సార్లు నిరూపించబడింది కూడా. అలాంటి అంతర్జాతీయ స్టార్ క్రికెటర్ల అభిమాని అయిన విశాఖవాసి బుధవారం గుండెపోటుతో మృతి చెందారు.

Andhra Pradesh: క్రికెటర్ కావాలనుకున్నాడు.. చివరికి గండెపోటుతో మృతి.. సంతాపం తెలిపిన స్టార్ క్రికెటర్లు
Cricket Kit
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Aug 31, 2023 | 4:31 PM

Share

దేశంలో క్రికెటర్లకు, ఆ మాటకు వస్తే అంతర్జాతీయంగా కూడా క్రికెటర్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. హాలీవుడ్, బాలీవుడ్‎ను మించి మిలియన్ల కొద్దీ అభిమానులు ఉంటారు. కానీ అలాంటి క్రికెట్ హీరోలకు ఇష్టమైన అభిమానులు కూడా ఉంటారంటే నమ్ముతారా? కానీ ఇది నమ్మి తీరాల్సిన నిజం. గతంలో అనేక సార్లు నిరూపించబడింది కూడా. అలాంటి అంతర్జాతీయ స్టార్ క్రికెటర్ల అభిమాని అయిన విశాఖవాసి బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. గాజువాకకు చెందిన ఈశ్వర్ వయసు 35 సంవత్సరాలు. నిన్న ఇంట్లోనే గుండెపోటుతో కుప్పకూలగా హాస్పిటల్‎కు తరలించే లోపు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న భారత వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ గాజువాకలోని ఈశ్వర్ ఇంటికి వెళ్లి మృతదేహానికి నివాళులు అర్పించారు.

క్రికెట్ దిగ్గజాల సంతాపం ఈశ్వర్ మృతి వార్త ను తెలుసుకున్న పలువురు జాతీయ, అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు సంతాపం తెలియ చేశారు. రికి పాంటింగ్, డేవిడ్ వార్నర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ మరియు పలువురు క్రికెటర్లు సంతాపం తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నంకు చెందిన ఈశ్వర్‎కు చిన్ననాటి నుంచి క్రికెటర్ కావాలనే లక్ష్యం పెట్టుకున్నాడు. పాఠశాల, కళాశాల స్థాయిల్లో ఆడగలిగాడు కానీ కల నెరవేరలేదు. భారత మాజీ ఆటగాడు వేణు గోపాలరావుకు సమకాలికుడు. ఆయనతో కలిసి ప్రాక్టీస్ చేసేవాడు. తన కోరిక నెరవేరకపోయినా తన స్నేహితుడు వేణుగోపాల్‎కు టీమ్ ఇండియాలో స్థానం దక్కడంతో సంబరపడిపోయాడు. వేణుతో కలిసి నెట్ ప్రాక్టీస్ లో పాల్గొనేవాడు ఈశ్వర్. వేణు గోపాల్ తనతో పాటు ఈశ్వర్‌ను మ్యాచ్‎లకు తీసుకెళ్లేవాడు. దీంతో జాతీయ స్థాయిలో పలువురితో పరిచయాలు ఏర్పడడమే కాకుండా అంతర్జాతీయ మ్యాచ్‎లు ఎక్కడ జరుగుతున్న వెళ్ళడం, వేణు ప్రోత్సాహంతో స్టార్ క్రికెటర్లకు నెట్ ప్రాక్టీస్‎లో బౌలింగ్ చేస్తుండడంతో అందరికీ అభిమాని అయిపోయాడు.

ఇవి కూడా చదవండి

ఇతర దేశాల జట్లు మన దేశానికి వచ్చిన సందర్భంలోనూ వారితో కలిసి ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనేవాడు. దీంతో అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లందరికి అభిమానిగా మారిపోయాడు ఈశ్వర్. తాను క్రికెటర్ కావాలనుకున్న కోరిక నెరవేరక పోయినా క్రికెట్‌పై అతడికి ఉన్న మక్కువని గమనించిన క్రికెటర్లు.. ఢిల్లీ డేర్ డెవిల్స్ యాజమాన్యం తో మాట్లాడి ఐపీఎల్ “సైడ్ ఆర్మ్ త్రో” బౌలర్ గా నియమించారు. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తనకు ఆసక్తి ఉన్న పనులపై నిరంతరం దృష్టి పెట్టి సాధన చేస్తే సాధించనిది ఏమీ లేదనడానికి ఈశ్వర్ ప్రయాణమే ఒక స్పూర్తి. కానీ అతడు హఠాత్తుగా మరణించడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.