Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Sharmila: సోనియా, రాహుల్ గాంధీతో షర్మిల మంతనాలు.. పార్టీ విలీనంపైనే కీలక చర్చలు

వైఎస్‌ఆర్ బిడ్డగా ప్రజల్లోనే ఉంటా.. కేసీఆర్ పతనం కోసం పనిచేస్తానంటూ తేల్చిచెప్పేశారామె. ఈ మాటలను బట్టి చూస్తే.. ఆమె పూర్తిగా తెలంగాణ రాజకీయాల మీదే ఫోకస్ పెట్టబోతున్నట్టు స్పష్టమైంది. అంటే ఏపీకి వెళ్లే ఆలోచన లేదనేది అర్ధమైంది. ఇక క్లారిటీ రావాల్సిన అసలు విషయం.. పార్టీ విలీనం. ఎస్.. కాంగ్రెస్ పార్టీలో వైఎస్‌ఆర్టీపీ విలీనం ఉంటుందా.. లేదా.. ఒకవేల విలీనం జరిగితే ఎప్పటిలోపు జరుగుతుంది. ఏ షరతుల మీద ఈ ప్రక్రియ సాగుతుందనేది ఇప్పుడు క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకోవైపు తెలంగాణలో ఉంటే..

YS Sharmila: సోనియా, రాహుల్ గాంధీతో షర్మిల మంతనాలు.. పార్టీ విలీనంపైనే కీలక చర్చలు
YS Sharmila
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 31, 2023 | 12:45 PM

ఢిల్లీ, ఆగస్టు 31: వైఎస్‌ఆర్ బిడ్డగా ప్రజల్లోనే ఉంటా.. కేసీఆర్ పతనం కోసం పనిచేస్తానంటూ తేల్చిచెప్పేశారు వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. కేసీఆర్ సర్కారుకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యిందంటూ ఢిల్లీలో సోనియాతో భేటీ అనంతరం కామెంట్ చేశారు షర్మిల.  తెలంగాణకు సంబంధించిన అంశాలపైనే సోనియా, రాహుల్‌తో చర్చించినట్లు చెప్పారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకే తాను నిరంతరం పనిచేస్తుంటానని అన్నారు.వైసీఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారం నేపథ్యంలో సోనియా, రాహుల్‌తో షర్మిల సమావేశం కావడం చర్చకు కారణంగా మారింది.

ఢిల్లీ వేదికగా వైఎస్ షర్మిల చేసిన హాట్ కామెంట్. కాంగ్రెస్‌లోకి వైఎస్‌ఆర్టీపీ విలీనంపై చర్చలు జరిపేందుకు ఢిల్లీ వెళ్లిన షర్మిల.. సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీని కలిశారు. ఆ తర్వాత ఆమె టెన్ జెన్‌పధ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మాటలను బట్టి చూస్తే.. ఆమె పూర్తిగా తెలంగాణ రాజకీయాల మీదే ఫోకస్ పెట్టబోతున్నట్టు స్పష్టమైంది. అంటే ఏపీకి వెళ్లే ఆలోచన లేదనేది అర్ధమైంది. కాంగ్రెస్ అధిష్టానంతో జరిగిన చర్చలు ఏం అంశాలపై జరగాయనే విషయం మాత్రం బయటకు చెప్పలేదు షర్మిల.

ఇక క్లారిటీ రావాల్సిన అసలు విషయం.. పార్టీ విలీనం. కాంగ్రెస్ పార్టీలో వైఎస్‌ఆర్టీపీ విలీనం ఉంటుందా.. లేదా.. ఒకవేల విలీనం జరిగితే ఎప్పటిలోపు జరుగుతుంది. ఏ షరతుల మీద ఈ ప్రక్రియ సాగుతుందనేది ఇప్పుడు క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకోవైపు తెలంగాణలో ఉంటే తాను ప్రకటించినట్టు పాలేరు నుంచి బరిలోకి దిగుతారా.. లేక ఇంకేమైనా మార్పులు ఉంటాయా అనేది ఆసక్తిగా మారింది.

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీని గద్దె దింపడానికి తాను శాయశక్తుల కృషి చేస్తానని గతంలో ప్రకటించిన షర్మిల.. ఇప్పుడు కూడా ఆదే స్టాండ్‌ మీదున్నట్లుగా ఆమె మాటల్లో అర్థమవుతోంది. రాజన్న బిడ్డగా తెలంగాణ ప్రజల కోసం తాను ఎప్పుడూ పని చేస్తూ ఉంటానని మరో చెప్పడం… మొదట్నుంచి బీఆర్ఎస్‌ పార్టీనే తనకు ప్రధాన ప్రత్యర్ది అని చెప్పడం.. సోనియా, రాహుల్‌తో సమావేశం జరిగిన అనంతరం ఆమె మాట్లాడిన తీరు కూడా త్వరలోనే వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో కలిపేయడం ఖాయమని చెప్పకనే చెప్పినట్లుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం