ఇన్‌స్టా గోల్డెన్ బాయ్‌కు వేధింపులు.. 18 తులాల బంగారం, 2 లక్షల నగదు లాక్కెళ్లిన దొంగలు
రాత్రికి రాత్రే ఫేమస్ అవ్వాలని ఒంటి నిండా బంగారం ధరించాడు. రకరకాల వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టాడు. అంతే అనుకున్నట్లుగానే ఒక్క సారిగా అతని పేరు అంతటా మారుమ్రోగిపోయింది. ఐతే ఊహించని విధంగా ఈ రీల్ స్టార్ వద్ద ఓ దొంగ 18 తులాల బంగారు గొలుసు, 2 లక్షల రూపాయలు దోచుకెళ్లాడు. ఈ విషయం బయట చెబితే నువ్వు నా పాట్నర్..
పూణె, ఆగస్టు 31: రాత్రికి రాత్రే ఫేమస్ అవ్వాలని ఒంటి నిండా బంగారం ధరించాడు. రకరకాల వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టాడు. అంతే అనుకున్నట్లుగానే ఒక్క సారిగా అతని పేరు అంతటా మారుమ్రోగిపోయింది. ఐతే ఊహించని విధంగా ఈ రీల్ స్టార్ వద్ద ఓ దొంగ 18 తులాల బంగారు గొలుసు, 2 లక్షల రూపాయలు దోచుకెళ్లాడు. ఈ విషయం బయట చెబితే నువ్వు నా పాట్నర్ వని సోషల్ మీడియాలో అందరికీ చెప్పి నీ పరువు తీస్తానంటూ బ్లాక్ మెయిల్ చేయసాగాడు. దీంతో లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ విచిత్ర ఘటన పూణెలోని కల్భోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉరులి కంచన్‌లోని షింద్‌వానేలో చోటుచేసుకుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో గోల్డెన్ బాయ్‌గా పేరుగాంచిన రీల్స్ స్టార్ ధర్మేంద్ర అలియాస్ మోను బాలాసాహెబ్ బడేకర్ (30) రీల్స్ స్టార్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకు నాలుగున్నర లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. రకరకాల వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటాడు. ఇతని వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. నిందితుడు మహేష్ అలియాస్ మల్లప్ప సాహెబ్ హోస్మాని అతడికి పరిచయస్తుడు. కొద్ది రోజుల క్రితం ధర్మేంద్ర వద్ద18 తులాల బంగారు గొలుసు తీసుకెళ్లారు. కొన్ని రోజుల తర్వాత ధర్మేంద్ర తన బంగారు గొలుసును తిరిగి అడిగాడు. కానీ నిందితుడు గొలుసును తిరిగి ఇవ్వడానికి బదులుగా, అతని నుంచి మూడు లక్షల నగదు డిమాండ్ చేశాడు. పైగా ధర్మేంద్రను దుర్భాషలాడాడు.
‘నేను కరడుగట్టిన దొంగనని, నేను దొంగిలించిన బంగారమంతా నీ దగ్గరకు తీసుకువస్తున్నట్లు పోలీసులకు చెబుతాను. నువ్వు పెద్ద రీల్ స్టార్వికదా.. ఇప్పుడు నీ పరువు ఎలా తీస్తానో చూడు. నువ్వే నాకు మూడు లక్షల రూపాయలు ఇవ్వు. లేకపోతే నీ పరువు తీస్తా. నేను దొంగతనం చేసిన బంగారం నీకు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో చెప్పి, నీ పరువు తీస్తా. అప్పుడు నువ్వు గోల్డెన్ బాయ్‌వి ఎలా అయ్యావో నీ ఫాలోవర్స్ తెలుస్తుందంటూ ధర్మేంద్రను బెదిరించసాగాడు నిందితుడు. దీంతో బెంబేలెత్తిపోయిన ధర్మేంద్ర నిందితుడికి రెండు లక్షల రూపాయలు సమర్పించుకున్నాడు. అయితే నిందితుడు మరింత డబ్బు డిమాండ్ చేయడంతో చివరికి పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయమై లోని కల్భోర్ పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.