AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDIA Alliance: నేడు ‘ఇండియా’ కూటమి భేటీ.. ఈ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం..!

బీజేపీని గద్దె దించడమే టార్గెట్‌గా జట్టు కట్టిన విపక్ష పార్టీలు.. ఆ దిశగా స్పీడ్ పెంచాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటడంతో.. కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు సమాయత్తమవుతున్నాయి. అందుకోసమే ఇవాళ, రేపు మహారాష్ట్రకు మకాం మార్చాయి విపక్ష పార్టీలు. అయితే ఇప్పటి దాకా ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అంటున్న విపక్ష కూటమి.. తాజా సమావేశంలో తమ కూటమి లోగో తో పాటు.. భవిష్యత్ కార్యాచరణ, అనుసరించిన వ్యూహాలపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా...

INDIA Alliance: నేడు ‘ఇండియా’ కూటమి భేటీ.. ఈ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం..!
INDIA Alliance
Shiva Prajapati
|

Updated on: Aug 31, 2023 | 11:04 AM

Share

బీజేపీని గద్దె దించడమే టార్గెట్‌గా జట్టు కట్టిన విపక్ష పార్టీలు.. ఆ దిశగా స్పీడ్ పెంచాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటడంతో.. కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు సమాయత్తమవుతున్నాయి. అందుకోసమే ఇవాళ, రేపు మహారాష్ట్రకు మకాం మార్చాయి విపక్ష పార్టీలు. అయితే ఇప్పటి దాకా ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అంటున్న విపక్ష కూటమి.. తాజా సమావేశంలో తమ కూటమి లోగో తో పాటు.. భవిష్యత్ కార్యాచరణ, అనుసరించిన వ్యూహాలపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రధాని అభ్యర్ధి ఎవరనే దానిపైనా కూటమిలో చర్చ ఉండబోతోంది.

రాష్ట్రాల్లో ఎవరి గుర్తుపై వాళ్లే పోటీ చేయాలని కూటమి పార్టీలు ఇప్పటికే నిర్ణయించాయి. అయితే ఇండియా కూటమి కన్వీనర్‌గా ఎవరు ఉంటారన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. కూటమి ప్రధాని అభ్యర్ధిగా.. రాహుల్ గాంధీ ఉంటారంటూ కాంగ్రెస్ నుంచి ప్రకటన వచ్చింది. ఈ విషయంలో సందేహం అక్కర్లేదని, ముమ్మాటికి రాహుల్‌గాంధీ ప్రధాని అభ్యర్ధిగా బరిలో ఉంటారని సంచలన ప్రకటన చేశారు రాజస్థాన్‌ సీఎం అశోక్‌గెహ్లాట్‌. రాహుల్‌గాంధీకి ప్రధానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయనేది ఆయన అభిప్రాయం.

ఇదే సమయంలో ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు తెరలేపాయి. ఇండియా కూటమి తరఫున ప్రధాని అభ్యర్ధిగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ సరైన వ్యక్తి అని ప్రియాంక చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఢిల్లీని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దిన కేజ్రీవాల్‌కే.. దేశాన్ని నడిపే సత్తా ఉందంటున్నారామె.

ప్రధానమంత్రి పదవి రేసులో మమతా బెనర్జీ సహా పలువురు కీలక నేతలు కూడా ఉన్నారు. మరోవైపు బీహార్‌ సీఎం నితీష్‌కుమార్‌ను కన్వీనర్‌గా ఎన్నుకుంటారని ప్రచారం జరిగింది. అయితే తనకు ఆ పదవి మీద ఆసక్తి లేదని నితీష్‌ తేల్చేశారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కూటమి కన్వీనర్‌గా ఎవరిని ఎన్నుకుంటారు. ప్రధాని అభ్యర్ధిగా ఎవరిని ఎంపిక చేస్తారు.. ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదురుతుందా.. లేదా అనేదే ఇప్పుడు ఆసక్తికర అంశం.

విపక్ష కూటమి మొదటి మీటింగ్ పాట్నాలో జరిగింది. బెంగళూరులో రెండోసారి సమావేశం జరిగింది. ఇప్పుడు ముంబై వేదికగా.. సమావేశమవుతోంది విపక్ష ఇండియా కూటమి. మే 23న బెంగళూరులో జరిగిన సమావేశంలో 26 పార్టీలు పాల్గొంటే, ఈరోజు సమావేశానికి 28 పార్టీలు హాజరవుతున్నాయి. ముచ్చటగా మూడోసారి భేటీ అవుతున్న ఈ కూటమి.. ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయాలు ఆసక్తికరంగా మారాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..