Joe Biden India Visit: ఢిల్లీలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ బస చేయనున్న హోటల్‌లో ఒక్క రాత్రికి ఎన్ని లక్షలు ఛార్జి చేస్తారో తెలుసా
G20 summit: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ బస చేయనున్న హోటల్ ఐటీసీ మౌర్య హోటల్ దేశంలోని అగ్రశ్రేణి హోటళ్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. వారు ఉండేందుకు ఒకటి రెండు గదులు కాదు ఏకంగా 400 గదులు బుక్ చేశారు. చాలా మంది విదేశీ VVIP అతిథులు ఇక్కడే ఉంటారు. బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ హోటల్ షాంగ్రి-లాలో బస చేస్తారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ క్లారిడ్జ్ హోటల్‌లో బస చేయనున్నారు. అదే సమయంలో చైనా అధ్యక్షుడు తాజ్ హోటల్‌లో బస చేస్తారు.

ఢిల్లీ, ఆగస్టు 31: జి-20 సదస్సులో పాల్గొనేందుకు పలు పెద్ద దేశాల దేశాధినేతలు భారత్‌కు రానున్నారు. వీరి కోసం దేశ రాజధాని ఢిల్లీలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీలోని 30కి పైగా హోటళ్లలో ప్రపంచంలోని పెద్ద నాయకులందరూ బస చేసేందుకు వీలుగా హోటల్స్‌ను బుక్ చేశారు. ఆ హోటల్స్‌లో వారికి అనుకూలంగా ఉండేలా తీర్చిదిద్దునున్నారు. అయితే, ఈ రోజు ఈ కథనంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ బస చేయబోయే హోటల్ గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. దీంతో పాటు ఇతర దేశాల అధినేతలు బస చేసే హోటళ్ల గురించి కూడా తెలుసుకోవచ్చు.
ఇండియా టుడేలో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తోపాటు అతని వెంట వచ్చే మొత్తం అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఉండేందుకు ITC మౌర్యను బుక్ చేశారు. ఇక్కడ వారు ఉండేందుకు ఒకటి రెండు గదులు కాదు ఏకంగా 400 గదులు బుక్ చేశారు. ఇందులో ఈ హోటల్‌లోని 14వ అంతస్తులో జో బిడెన్ ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో పెద్ద విషయం ఏంటంటే.. ఈ ఫ్లోర్‌కి వెళ్లేందుకు ప్రత్యేకంగా లిఫ్టు కూడా సిద్ధం చేశారు. అందులో కేవలం అమెరికా ప్రెసిడెంట్ మాత్రమే ప్రయాణిస్తారు. ఇతరులు ఎవరూ ఇందులో ప్రయాణించేందుకు అనుమతి లేదు.
ఒక రోజు అద్దె ఎంత ఉంటుందో తెలుసా..
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ బస చేయనున్న హోటల్ ఐటీసీ మౌర్య దేశంలోని అగ్రశ్రేణి హోటళ్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. చాలా మంది విదేశీ వీవీఐపీ అతిథులు ఇక్కడే ఉంటారు. ఈ హోటల్ శాఖలు భారతదేశం అంతటా ఉన్నాయి. ఈ హోటల్‌లోని వివిధ గదుల అద్దె భిన్నంగా ఉంటుంది. ఇందులో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ బస చేసే గదికి మాత్రం అత్యధిక అద్దెను చెల్లిస్తారు. బిజినెస్ టుడేలో ప్రచురితమైన వార్త ప్రకారం, జో బిడెన్ బస చేయనున్న ఈ హోటల్ చాణక్య సూట్‌లో ఒక రాత్రి బసకు దాదాపు రూ. 8 లక్షలు. ఈ సూట్ 4600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది.
మిగిలిన వారు ఎక్కడ ఉంటారంటే..
మిగిలిన వ్యక్తుల గురించి మాట్లాడుకుంటే.., బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ హోటల్ షాంగ్రి-లాలో బస చేస్తారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ క్లారిడ్జ్ హోటల్‌లో బస చేయనున్నారు. అదే సమయంలో చైనా అధ్యక్షుడు తాజ్ హోటల్‌లో బస చేస్తారు. ఇతర దేశాల అధినేతలు విడివిడిగా బుక్ చేసుకున్న ముప్పైకి పైగా హోటళ్లలో బస చేస్తారు. ఈ సమ్మిట్ కారణంగా ఢిల్లీ మొత్తం ఈ సమయంలో కంటోన్మెంట్‌గా మారింది. ముఖ్యంగా 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఢిల్లీలో పక్షులను కూడా టచ్ చేయలేరు. పూర్తి కట్టుదిట్టమైన భద్రత మధ్య ఢిల్లీ నగరం ఉండనుంది.
మరిన్నిజాతీయ వార్తల కోసం




