Andhra Pradesh: దేవాలయాల్లో వాటిని దోచుకున్నారు.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు

దేవాలయాలే వాళ్ళ టార్గెట్.. ఆలయాల్లో ఉన్న ఏ వస్తువును వదలరు. అందిన కాడికి దోచుకుంటారు. విలువైన వస్తువులతో పాటు చిల్లర పైసలు కూడా దోచుకెళ్తారు. అసలు వాళ్ళ టార్గెట్ ఇండ్లు, బ్యాంక్‎లు కాదు శివారు ప్రాంతాల్లో ఉండే దేవాలయాలే. ఆలయాల చోరే వాళ్ళ వృత్తిగా ఎంచుకున్న ముగ్గరు సభ్యుల అంతర్ రాష్ట్ర ముఠాను నంద్యాల జిల్లా పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి నాలుగు లక్షల విలువగల ఆలయాల సామాగ్రి,నగదును స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. వీళ్ళ ముగ్గురిలో ఒకరు మైనర్ కావడంతో జువైనల్ పోలీసులు తరలించారు.

Andhra Pradesh: దేవాలయాల్లో వాటిని దోచుకున్నారు..  పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు
Police
Follow us
J Y Nagi Reddy

| Edited By: Aravind B

Updated on: Aug 31, 2023 | 4:32 PM

దేవాలయాలే వాళ్ళ టార్గెట్.. ఆలయాల్లో ఉన్న ఏ వస్తువును వదలరు. అందిన కాడికి దోచుకుంటారు. విలువైన వస్తువులతో పాటు చిల్లర పైసలు కూడా దోచుకెళ్తారు. అసలు వాళ్ళ టార్గెట్ ఇండ్లు, బ్యాంక్‎లు కాదు శివారు ప్రాంతాల్లో ఉండే దేవాలయాలే. ఆలయాల చోరే వాళ్ళ వృత్తిగా ఎంచుకున్న ముగ్గరు సభ్యుల అంతర్ రాష్ట్ర ముఠాను నంద్యాల జిల్లా పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి నాలుగు లక్షల విలువగల ఆలయాల సామాగ్రి,నగదును స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. వీళ్ళ ముగ్గురిలో ఒకరు మైనర్ కావడంతో జువైనల్ పోలీసులు తరలించారు. నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపిన వివారాల మేరకు మహానంది మండలం చెందిన ఎరుకల నల్లబోతుల నాగప్ప అలియాస్ రాజు,అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన చప్పిడి మణి అలియాస్ జావిద్ తో పాటు మరో మైనర్ యువకుడుతో కలిసి ఓక ముఠా ఏర్పడ్డారు.వీళ్లు ముగ్గరు కలిసి గత కొన్ని నెలల కాలంలోనే ఒక ఇంటితో పాటు మూడు దేవాలయాలలో చోరీలకు పాల్పడ్డారు.

గతంలో కూడా వీళ్లు ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాలలోతో పాటు హైదరాబాద్, కర్ణాటక రాష్ట్రలలోని చోరీలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే మొదటి ముద్దాయి అయిన ఎరుకలి నల్లబోతుల నాగప్పపై (65) దొంగతనం కేసుల ఉండటంతో పాటు పది కేసులపై కూడా అతడు జైల్లో శిక్ష అనుభవించాడు. మరో ముద్దాయి అయిన మణి పైన గతంలో 4 దొంగతనం కేసులు ఉన్నాయి. వీళ్ల ఇద్దరూ కడప సెంట్రల్ జైల్ లో శిక్ష అనుభవిస్తున్న సమయం లో పరిచయం ఏర్పడి జైల్ నుండి బయటికి రాగానే కలిసి దొంగతనములు చేయటం ప్రారంభించినట్లు ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసిన పోలీసులు వాళ్ల వద్ద నుంచి నాలుగు తులాల బంగారు చైన్, 4 తులాల బంగారు గాజులు,4 గుడి గంటలు,ఒక శివలింగం మీది ఉండే నాగపడిగ, 6 ఇత్తడి పాత్రలు,4 అన్నం వండుకునే అండాలు, అమ్మవారి వెండి చేతులు తొడుగులు,2 అమ్మవారి ఇత్తడి పాదాలు తొడుగులు, 6 దీపారాధన కుందులు, అమ్మవారి చెవి పోగులు, 150 స్టీల్ ప్లేట్లు,1 రాగి బిందె,6 ఇత్తడి గిన్నెలు,4 రాగి చెంబులు,1 పెద్ద హారతి పళ్ళెం,6 స్టీల్ చెంబులు, అమ్మవారి బంగారు బొట్టుబిళ్ళ, బంగారు ముక్కుపుడక, వెండికిరీటం, హుండీ లోని రూ.32,261 నగదును స్వాధీనం చేసుకున్నారు.

మొత్తం దాదాపు రూ.4 లక్షల విలువగల సొత్తుతో పాటు నగదును స్వాధీనం చేసుకొని ముద్దాయిలను రిమాండ్ కు తరలించారు. కేసులను చేధించడంలో కృషి చేసిన పోలీసులకు ఎస్పీ రఘువీర్ రెడ్డి నగదు రివార్డులను అందజేశారు. ఈ సందర్బంగా ప్రార్థనా మందిరాల నిర్వహకులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. ప్రార్ధనా స్థలాల వద్ద నాణ్యమైన సీసీ కెమెరాలతో పాటు ప్రతిరోజూ రాత్రి సమయాల్లో వాచ్ మ్యాన్ ఉండేలా చూసుకోవాలని తెలిపారు.అపరిచిత వ్యక్తుల నుంచి వ్యాపారులు దొంగ సొత్తును కొనటం చెయ్యరాదని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.