Sabarimala: శబరిమలకు వెళ్తూ లోయలో పడిన ఏపీ భక్తుల బస్సు.. ముగ్గురి పరిస్థితి విషమం..
శబరిమలకు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. వారు ప్రయాణిస్తున్న బస్సు పతనంథిట్ట సమీపంలో లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి...
శబరిమలకు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. వారు ప్రయాణిస్తున్న బస్సు పతనంథిట్ట సమీపంలో లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు కొండ ఎక్కుతుండగా అదుపుతప్పి కింద పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా.. శబరిమలలో మణికంఠుడి దర్శనాలు ఈ బుధవారం సాయంత్రం 5గంటల నుంచి ప్రారంభమయ్యాయి. తంత్రి కందరరు రాజీవరు సమక్షంలో పదవీ విరమణ చేసిన మేల్శాంతి పరమేశ్వరన్ నంపూతిరి మండలపూజ చేసి గర్భగుడిని ప్రారంభించారు. డిసెంబర్ 27 వరకు మండల పూజ కొనసాగనుంది.
కరోనా కారణంగా రెండేళ్లుగా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించిన శబరిమల ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు.. ఈ ఏడాది అన్ని కొవిడ్ ఆంక్షలను తొలగించింది. అయితే భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పంబా నది భారీగా ప్రవహిస్తుండటంతో ఈ ప్రాంతంలో అలర్ట్ జారీ చేసింది. ఏటా లక్షలాది మంది అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలకు వెళ్తుంటారు. శబరిమల పర్యాటకుల సంఖ్య ఈ ఏడాది భారీగా పెరిగే అవకాశం ఉంది. దర్శనాలు స్టార్ట్ అయిన వారం రోజులు కూడా కాకముందే ఈ ఘటన జరగడం తీవ్ర విషాదంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..