Kurnool: పండుగ పూట విషాదం.. మెంతో ప్లస్ డబ్బా గొంతులో ఇరుక్కుని.. పది నెలల చిన్నారి మృతి..
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఇరవై ఏళ్ల తర్వాత కలిగిన సంతానం.. అని అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. కానీ.. వారి ఆనందం ఎంతో కాలం నిలవలేదు. కేవలం పది నెలలకే ఊహించని విధంగా చిన్నారి కన్నుమూయడం..
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఇరవై ఏళ్ల తర్వాత కలిగిన సంతానం.. అని అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. కానీ.. వారి ఆనందం ఎంతో కాలం నిలవలేదు. కేవలం పది నెలలకే ఊహించని విధంగా చిన్నారి కన్నుమూయడం ఆ ఇంట తీవ్ర విషాదం నింపింది. అది కూడా నూతన సంవత్సరం మొదటి రోజు కావడం మరింత విషాదకరం. కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం చింతమాను పల్లె గ్రామంలో కొత్త సంవత్సరం రోజున తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన నల్లన్న – సువర్ణ దంపతులకు పది నెలల కుమారుడు ఉన్నాడు. ఆదివారం నూతన సంవత్సరం వేడుకల్లో తల్లిదండ్రులు, బంధువులు సందడిగా ఉన్న సమయంలో ఓ చిన్నారి మెంతో ప్లస్ తైలం డబ్బాతో ఆడుకుంటున్నాడు. డబ్బాను నోట్లో పెట్టుకోగా.. ప్రమాదవశాత్తు అది గొంతులో ఇరుక్కుంది. వెంటనే అలర్ట్ అయిన తల్లిదండ్రులు డబ్బాను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అయినా లాభం లేకపోవడంతో హాస్పిటల్ కు తీసుకెళ్లేస్తుండగా మృతి చెందాడు.
అయితే.. 20 సంవత్సరాల తర్వాత పుట్టిన సంతానం కళ్లెదుటే మృతి చెందడంతో తల్లిదండ్రుల కన్నీరుమున్నీరవుతున్నారు. గొంతులో డబ్బా ఇరుక్కోవడంతో ఊపిరాడక మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కాబట్టి.. చిన్నారులు ఉన్న ఇంట్లో పెద్దవాళ్లు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. వారు చేసే ప్రతి పనిని గమనిస్తుండాలి. ఏం చేస్తున్నారు.. ఏం తింటున్నారు.. అనే విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. చిన్న పిల్లలు వారికి దొరికిన వస్తువును నోట్లో పెట్టకుంటూ ఉంటారు. ఈ పనులు కొన్ని సార్లు ప్రమాదకరంగా మారవచ్చు. చివరకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..