BRS: గులాబీ తోటలో కాపు పంట.. ఏపీలో ఎంటర్ ద కేసీఆర్.. ఇవాళ బీఆర్‌ఎస్‌లోకి తోట చంద్రశేఖర్..
టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయ్యాక..విస్తరణ మొదలైంది..పక్కరాష్ట్రాల్లో కూడా కాలు పెడుతోంది.. ఏపీలో కూడా ఎంటరవుతోంది. ఇప్పటికే పలువురు కారెక్కేందుకు సిద్ధమయ్యారు.. వాళ్లెవరో ఏంటో..
గులాబీ తోటలో కాపు పంట కాస్తుందా..సరిహద్దు దాటి వచ్చిన కారులో కాపు నాయకులు ఇమడగలరా..విజయవాడ హైవేలో కారు దూసుకుపోతుందా.. బీఆర్‌ఎస్ విస్తరణలో భాగంగా.. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు(కేసీఆర్) ఏపీ కాపు నేతలకు గాలం వేశారా.. ఇప్పటికే ముగ్గురు కీలక నేతలను ఒప్పించారా.. వాళ్లకు ఈ సాయంత్రమే గులాబీ కండువా కప్పబోతున్నారా.. ఏపీలో కాపు రాజకీయం కేక పుట్టిస్తున్న తరుణంలో కేసీఆర్ పార్టీ విస్తరణ పాచిక ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి. అయితే.. జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు భారత్ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన కేసీఆర్.. ఒక్కో అడుగూ వ్యూహాత్మకంగా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌పై సీరియస్‌గా ఫోకస్ పెట్టారాయన. అందులో భాగంగా రాజకీయ నాయకులతో పాటు, మాజీ బ్యూరోక్రాట్లను చేర్చుకోబోతున్నారు.
మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్‌లో చేరబోతున్నారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారాయన. కాపు సామాజికవర్గానికి చెందినవారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్ష పదవికి ఆయన పేరు పరిశీలనలో ఉన్నట్టు చెప్తున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి, మాజీ ఐఆర్ఎస్ అధికారి రావెల కిషోర్‌బాబు కూడా కారెక్కనున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఆయన.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. మరో మాజీ ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారధి, వ్యాపారవేత్త ప్రకాష్ బీఆర్ఎస్‌లో చేరబోతున్నారు. అనంతపురం జిల్లాలో రాజకీయ కుటుంబానికి చెందిన ప్రకాష్ బలిజ సామాజిక వర్గానికి చెందినవారు. జనసేనలో యాక్టివ్‌గా పనిచేసిన పార్థసారధి ఆ తర్వాత పార్టీకి దూరం జరిగారు. ఇప్పుడు బీఆర్ఎస్‌లో చేరుతున్నారు.
సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు చేరికల ముహూర్తం. తెలంగాణ భవన్ వేదిక. సీఎం కేసీఆర్ స్వయంగా వారిని బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించనున్నారు. ఏపీ నుంచి పెద్దసంఖ్యలో నాయకులు కారెక్కుతారని చెప్తున్నారు. మరికొందరి పేర్లు వినిపిస్తున్నా.. కన్ఫామ్ కావాల్సి ఉంది. ముందు ముందు ఈ చేరికల సంఖ్య పెరుగుతుందని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు.
అయితే ముఖ్యంగా తోట చంద్రశేఖర్ టీఆర్ఎస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. చంద్రశేఖర్‌తోపాటు తూర్పుగోదావరి జిల్లా నుంచి పలు నియోజవర్గాల నాయకులు ముమ్మిడివరం- జి .రాధాకృష్ణ ( కన్నబాబు), పి గన్నవరం- ఎన్. బంగారు రాజు , కొత్తపేట- ఎస్ శ్రీనివాసరావు, రామచంద్రపురం – వి రావు, పి గన్నవరం- ఎస్ రాజేష్ కుమార్, జి శ్రీనివాస్, ఆవిడి జి రమేష్, యువ నాయకులు కొత్తపేట. కె మురళీకృష్ణ పప్పుల వారి పాలెం నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం