Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

News Watch: ఏపీలో బీఆర్‌ఎస్‌ బోణీ.. మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్..

News Watch: ఏపీలో బీఆర్‌ఎస్‌ బోణీ.. మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్..

Shaik Madar Saheb

|

Updated on: Jan 02, 2023 | 7:26 AM

మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌ బీఆర్ఎస్‌లో చేరబోతున్నారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారాయన. కాపు సామాజికవర్గానికి చెందినవారు. ఏపీ బీఆర్ఎస్‌ అధ్యక్ష పదవికి ఆయన పేరు పరిశీలనలో ఉన్నట్టు చెప్తున్నారు.



గులాబీ తోటలో కాపు పంట కాస్తుందా..సరిహద్దు దాటి వచ్చిన కారులో కాపు నాయకులు ఇమడగలరా..విజయవాడ హైవేలో కారు దూసుకుపోతుందా.. బీఆర్‌ఎస్‌ విస్తరణలో భాగంగా.. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు(కేసీఆర్‌) ఏపీ కాపు నేతలకు గాలం వేశారా.. ఇప్పటికే ముగ్గురు కీలక నేతలను ఒప్పించారా.. వాళ్లకు ఈ సాయంత్రమే గులాబీ కండువా కప్పబోతున్నారా.. ఏపీలో కాపు రాజకీయం కేక పుట్టిస్తున్న తరుణంలో కేసీఆర్‌ పార్టీ విస్తరణ పాచిక ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి. అయితే.. జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు భారత్‌ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన కేసీఆర్.. ఒక్కో అడుగూ వ్యూహాత్మకంగా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌పై సీరియస్‌గా ఫోకస్‌ పెట్టారాయన. అందులో భాగంగా రాజకీయ నాయకులతో పాటు, మాజీ బ్యూరోక్రాట్లను చేర్చుకోబోతున్నారు.

మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌ బీఆర్ఎస్‌లో చేరబోతున్నారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారాయన. కాపు సామాజికవర్గానికి చెందినవారు. ఏపీ బీఆర్ఎస్‌ అధ్యక్ష పదవికి ఆయన పేరు పరిశీలనలో ఉన్నట్టు చెప్తున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి, మాజీ ఐఆర్ఎస్ అధికారి రావెల కిషోర్‌బాబు కూడా కారెక్కనున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఆయన.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు.

Published on: Jan 02, 2023 07:26 AM