Vaikunta Ekadasi: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు.. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు..

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటికిటలాడుతున్నాయి.

Vaikunta Ekadasi: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు.. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు..
Vaikuntha Ekadashi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 02, 2023 | 7:01 AM

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటికిటలాడుతున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. తిరుమల సహా.. యాదాద్రి, అన్నవరం, భద్రచలం, ద్వారక తిరుమల, మంగళగిరి, విజయవాడ, అనంతపురం, ధర్మపురి తదితర అన్ని ప్రముఖ ఆలయాలు పోటెత్తాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి అర్ధరాత్రి 12.05 గంటలకు దర్శనాలను ప్రారంభించారు. ముందుగా అత్యంత ప్రముఖులు, ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ధర్మకర్తల మండలి సభ్యులు దర్శనం చేసుకునేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఉదయం 5 నుంచి 6 గంటల వరకు శ్రీవాణి ద్వారా టోకెన్లు పొందిన భక్తులను దర్శనానికి అనుమతించారు. ఉదయం 6 గంటల నుంచి సామాన్య భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. తిరుమలలో ఈ నెల 11 వరకు వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది.

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు..

శ్రీవారిని మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే, కర్నాటక గవర్నర్ థాహర్ చంద్ గెహ్లాట్, జమ్ము గవర్నర్ లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఏపీ డిప్యూటి సీఎం నారాయణస్వామి, ఏపీ తెలంగాణ మంత్రులు పెద్దిరెడ్డి, అంబటి రాంబాబు, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, విశ్వరూప్, ఏపి అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

Eknath Shinde

Eknath Shinde

భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. విద్యుత్ దీపాల వెలుగుల్లో ధగధగ మెరిసిపోతోంది తిరుమల. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సుమారు 10 టన్నుల పుష్పాలతో తిరుమలగిరులను అలంకరించింది టీటీడీ. ఒక్క శ్రీవారి ఆలయంలోనే ఐదు టన్నుల ఫ్లవర్స్‌తో పుష్పాలంకరణ చేశారు. ధ్వజస్తంభం, బలిపీఠం, ఉత్తర ద్వారం లోపల లక్ష కట్‌ ఫ్లవర్స్‌ను వినియోగించారు. ఉత్తర ద్వార దర్శనం తర్వాత దర్శించుకునేలా 30వేల కట్‌ ఫ్లవర్స్‌తో వైకుంఠ మండపాన్ని సిద్ధంచేసింది టీటీడీ. అర్ధరాత్రి 12గంటల 5నిమిషాలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. స్వామివారికి వైకుంఠ ఏకాదశి కైంకర్యాలు సమర్పించిన తర్వాత, అర్ధరాత్రి ఒంటి గంటా 45నిమిషాలకు ఉత్తర ద్వార దర్శనాలకు అనుమతించారు అధికారులు. రోజుకి దాదాపు 80వేల మంది భక్తుల చొప్పున పది రోజులపాటు దర్శనాలు చేసుకునేలా ఏర్పాట్లు చేసింది టీటీడీ.

ఇవి కూడా చదవండి

ఉత్తర ద్వార దర్శనం కోసం దేశనలుమూలల నుంచి తిరుమలకు తరలివచ్చారు వీఐపీలు. దాంతో, తిరుమలలో వీఐపీ భక్తుల తాకిడి అధికంగా కనిపిస్తోంది. వీఐపీలకు పద్మావతి గెస్ట్‌హౌస్‌, వకుళామాత రెస్ట్ హౌస్, నారాయణగిరి ప్రాంతాల్లో వసతి కేటాయించారు. సర్వదర్శనం భక్తులను కృష్ణతేజ గెస్ట్‌ హౌస్‌ నుంచి అనుమతిస్తున్నారు. శ్రీవాణి టికెట్లున్న భక్తులను వైకుంఠం-2 నుంచి లోపలికి పంపుతున్నారు. 300 రూపాయల టికెట్లున్న భక్తులను ATC అనుమతిస్తున్నారు. ఆర్జిత సేవలు, సిఫార్సు లేఖలు, ప్రివిలేజ్‌ దర్శనాలను రద్దు చేసిన టీటీడీ… దర్శనం టికెట్లు ఉంటేనే క్యూలైన్లలోని భక్తులను అనుమతిస్తున్నారు అధికారులు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం..