Heart Health: చలికాలంలో గుండెపోటు ప్రమాదం.. ఈ 5 టిప్స్‌తో ఆరోగ్యంగా ఉండండి..

ప్రస్తుతం భారతదేశం వ్యాప్తంగా విపరీతమైన చలి ఉంది. శీతాకాలపు ఎఫెక్ట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. జనవరి మరింత చలి పెరిగే అవకాశం ఉంది. అయితే, చలికాలంలో గుండెపోటు ముప్పు..

Heart Health: చలికాలంలో గుండెపోటు ప్రమాదం.. ఈ 5 టిప్స్‌తో ఆరోగ్యంగా ఉండండి..
Heart Attack
Follow us

|

Updated on: Jan 01, 2023 | 9:59 PM

ప్రస్తుతం భారతదేశం వ్యాప్తంగా విపరీతమైన చలి ఉంది. శీతాకాలపు ఎఫెక్ట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. జనవరి మరింత చలి పెరిగే అవకాశం ఉంది. అయితే, చలికాలంలో గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రత కారణంగా గుండె ధమనులు కుంచించుకుపోయి, రక్త సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. జనవరి మరింత చలి పెరిగే ప్రమాదం ఉంది. ఈ చలి కారణంగా.. గుండెపోటు ప్రమాదాలు పెరుగుతాయి. మరి చలికాలంలో గుండెపోటు రాకుండా ఏం చేయాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

శీతాకాలంలో మీ హృదయాన్ని ఇలా ఆరోగ్యంగా ఉంచుకోండి..

ఉదయం, రాత్రి బయటకు వెళ్లొద్దు..

కార్డియాలజిస్టుల ప్రకారం.. శీతాకాలంలో ఉదయం, రాత్రి ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లకూడదు. తక్కువ ఉష్ణోగ్రతలో బయట ఉండడం గుండెపై చెడు ప్రభావం చూపుతుంది. అత్యవసర పని కోసం బయటకు వెళ్లవలసి వస్తే, శరీరంలో వేడిని రాజేసే దుస్తులను ధరించాలి.

శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి..

చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం ద్వారా గుండెపోటు సమస్యను కట్టడిచేయొచ్చు. శరీరం వెచ్చగా ఉంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎలాంటి సమస్య ఉండదు.

ఇవి కూడా చదవండి

బ్రిస్క్ వాక్ చేయండి..

గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి బ్రిస్క్ వాక్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకోసం 40 నిమిషాల్లో 4 కిలోమీటర్లు నడిస్తే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండెపోటు ముప్పు తగ్గుతుంది.

ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి..

చలికాలంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలో చల్లని పదార్థాలు ఉండకూడదు. పుష్కలంగా పండ్లు, కూరగాయలను తీసుకోవచ్చు. గుండె జబ్బులకు మందులు వేసుకునే వారు సమయానికి మందులు వేసుకోవాలి.

అతిగా సప్లిమెంట్స్ తీసుకోవద్దు..

కొంతమంది చలికాలంలో జిమ్ చేస్తూనే శరీరాకృతి కోసం ఎక్కువగా సప్లిమెంట్స్ తీసుకుంటారు. అయితే, అతిగా సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల గుండెపోటు ప్రమాదం మరింత పెరుగుతుంది. అందుకే.. ఏ సీజన్‌లోనూ సప్లిమెంట్స్‌ను అధికంగా తీసుకోవద్దు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..