BRS in AP: త్వరలో ఏపీలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పర్యటన.. భారీ బహిరంగ సభ
ఏపీలో BRS విస్తరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. విజయవాడ దిశగా హైవేపై కారు దూసుకుపోతోంది. సోమవారం సాయంత్రం కీలక నేతలు గులాబీ కండువా కప్పుకోనున్నారు.
టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయ్యాక..విస్తరణ మొదలైంది..పక్కరాష్ట్రాల్లో కూడా కాలు పెడుతోంది.. ఏపీలో కూడా ఎంటరవుతోంది. అందులో భాగంగా రాజకీయ నాయకులతో పాటు, మాజీ బ్యూరోక్రాట్లను చేర్చుకోబోతున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ IRTS అధికారి రావెల కిశోర్‌బాబు, మాజీ IRS అధికారి పార్థసారథి, అనంతపురం జిల్లాకు చెందిన తుమ్మలశెట్టి జయప్రకాశ్ ప్రకాశ్‌లతో పాటు పలువురు సోమవారం సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. అంతేకాదు త్వరలో ఏపీలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పర్యటించనున్నారు. పార్టీ బలోపేతం కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. బీఆర్ఎస్ ఏపీ శాఖ కార్యాలయం త్వరలోనే ఏర్పాటు కానుంది. ఏపీలో బహిరంగ సభ ఏర్పాటుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తుంది. విజయవాడ లేక గుంటూరులో సభ ఉండే అవకాశం ఉంది. విశాఖలోనూ కేసీఆర్ పర్యటించే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి.
ఏపీ తర్వాత మిగిలిన రాష్ట్రాలపై కేసీఆర్ ఫోకస్ పెట్టనున్నారు. తొలెతె తెలంగాణ ఆనుకుని ఉన్న బార్డర్ జిల్లాలే టార్గెట్‌గా గులాబీ దళపతి వ్యూహారు రచిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలోనూ BRSని విస్తరించనున్నారు కేసీఆర్. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ నేతలతో.. రానున్న రోజుల్లో సమావేశం కానున్నారు. కర్ణాటక లో జెడిఎస్‌తో, మహారాష్ట్రలోని చిన్న పార్టీలతో పొత్తులు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నాందేడ్ ప్రాంతం నుంచి తాము బీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధమంటూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిశారు ఆ ప్రాంత నేతలు. జనవరి చివరి నాటికి మూడు రాష్ట్రాల్లో కమిటీలు వేయనుంది బిఆర్ఎస్ అధిష్టానం.
జాతీయ పార్టీగా మారేందుకు BRS వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకు అత్యంత వేగంగా పావులు కదుపుతున్నారు గులాబీ బాస్ కేసీఆర్. అందుకే కారును టాప్ గేర్ ముందుకు తీసుకెళ్లేందుకు జోరు పెంచారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..