Pawan Kalyan: చర్యలు చేపట్టాలి.. టీడీపీ సభలో తొక్కిసలాటపై పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన

ఇలాంటి కార్యక్రమాల విషయంలో నిర్వాహకులు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. పోలీసులు తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు పవన్‌ కల్యాణ్‌..

Pawan Kalyan: చర్యలు చేపట్టాలి.. టీడీపీ సభలో తొక్కిసలాటపై పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన
Pawan Kalyan
Follow us

|

Updated on: Jan 02, 2023 | 11:50 AM

గుంటూరు తొక్కిసలాటపై పవన్‌ కల్యాణ్‌ రియాక్ట్‌ అయ్యారు. చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట దురదృష్టకరమని.. ముగ్గురు పేద మహిళలు చనిపోవడం దిగ్భ్రాంతి కలిగించిందని తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు జనసేనాని. ఇలాంటి కార్యక్రమాల విషయంలో నిర్వాహకులు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. పోలీసులు తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు పవన్‌ కల్యాణ్‌. ఈ ఉదయం 9.50 సమయంలో పవన్‌ కల్యాణ్‌ను విమర్శిస్తూ ట్వీట్‌ చేశారు పేర్నినాని. ఇప్పటంలో ఇంటి ఆక్రమిత గోడలకు ఉన్న విలువ, సామాన్యుల ప్రాణాలకు లేదన్నట్టు నటించడం, ఎలాంటి విలువలకు తార్కాణమో అంటూ ట్వీట్ చేశారు.

మరోవైపు, కాపు రిజర్వేషన్ల సాధన కోసం దీక్షకు దిగిన మాజీ మంత్రి హరిరామజోగయ్యకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాపు రిజర్వేషన్ల కోసం 85 ఏళ్ల వయసులో జోగయ్య దీక్ష చేస్తున్నారని.. ఆయన ఆమరణ దీక్షపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్‌ చేశారు. హరిరామజోగయ్య ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనగా ఉందన్నారు. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చర్చలు జరపాలని పవన్‌ కోరారు.

ఇవి కూడా చదవండి

కాపు రిజర్వేషన్ల కోసం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సోమవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమైన మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు హరిరామజోగయ్యను ఆదివారం రాత్రి పోలీసులు బలవంతంగా అంబులెన్స్‌లో ఎక్కించి ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.