AP Employees: ఏపీ ఉద్యోగులకు బిగ్ అలెర్ట్.. బయోమెట్రిక్ ప్లేస్‌లో ఫేషియల్ అటెండెన్స్
ఉద్యోగుల పనితీరు, అటెండెన్స్‌పై ఫుల్ ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. మరింత రెస్పాన్స్‌బులిటీ పెంచేందుకు బయోమెట్రిక్ ప్లేస్‌లో ఫేషియల్ అటెండెన్స్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. ఇది, సోమవారం నుంచే అమలవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఫేషియల్ అటెండెన్స్ అమల్లోకి వచ్చింది. ఏపీ సెక్రటేరియట్‌లో ఈరోజు నుంచి ప్రయోగాత్మకంగా ఫేషియల్ అటెండెన్స్‌ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సచివాలయం, హెచ్‌వోడీ ఆఫీసులు, జిల్లా కార్యాలయాల్లో దీన్ని అమల్లోకి తెచ్చారు. ఇప్పటివరకు బయోమెట్రిక్ హాజరును అమలుచేస్తూ వచ్చిన ప్రభుత్వం… ఉద్యోగాల్లో మరింత రెస్పాన్స్‌బులిటీ పెంచేందుకు ఫేషియల్ అటెండెన్స్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. పాలన గాడి తప్పకుండా, పారదర్శకత లోపించకుండా ఈ చర్యలు చేపట్టింది.
ఇవాళ(2 జనవరి 2023), సచివాలయం, హెచ్‌వోడీ ఆఫీసులు, జిల్లా కార్యాలయాల్లో మాత్రమే అమల్లోకి వచ్చిన ఫేషియల్ అటెండెన్స్, ఈనెల 16నుంచి మొత్తం ఉద్యోగులందరికీ ఇంప్లిమెంట్‌కానుంది. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఫేషియల్ అటెండెన్స్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. రాష్ట్రస్థాయి ఉద్యోగులు ఉదయం 10నుంచి సాయంత్రం ఐదున్నర వరకు…. జిల్లాస్థాయి ఉద్యోగులు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం 5గంటల వరకు కచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది. కొత్త విధానం ప్రకారం ఆల్రెడీ ప్రత్యేక అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది ఐటీశాఖ. ఉద్యోగులంతా ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఫేషియల్ అటెండెన్స్ చేయాల్సి ఉంటుంది.
అంతేకాదు, ఉద్యోగుల హాజరుపై ఎప్పటికప్పుడు మిడ్ లెవల్‌లో మానటరింగ్ చేయనున్నారు ఉన్నతాధికారులు. మరోవైపు, ఉద్యోగుల పనితీరుపై ప్రత్యేక దృష్టిపెట్టారు సీఎస్ జవహర్‌రెడ్డి. రీసెంట్‌గా సచివాలయంలో ఆకస్మిక తనిఖీలుచేసి అటెండెన్స్ రిజిస్టర్లను సైతం పరిశీలించారు. మొత్తానికి ఉద్యోగుల అటెండెన్స్‌పై సీరియస్‌గా ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఇక, అలసత్వాన్ని సహించేది లేదనే హెచ్చరికలను పంపింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..