Mahasena Rajesh: మహాసేన రాజేష్‌ కారుపై వైసీపీ కార్యకర్తల దాడి.. ఒకరికి గాయాలు

మహాసేన రాజేష్ వర్సెస్ వైసీపీ.. మధ్యలో జనసేన.. రాజమండ్రిలో హైటెన్షన్ చోటుచేసుకుంది. రాజేష్‌ కారుపై దాడి చేయడానికి కారణమేంటి? సీన్ లోకి జనసేన ఎందుకు ఎంటరయింది.

Mahasena Rajesh: మహాసేన రాజేష్‌ కారుపై వైసీపీ కార్యకర్తల దాడి.. ఒకరికి గాయాలు
Mahasena Rajesh
Follow us
Ram Naramaneni

| Edited By: Anil kumar poka

Updated on: Jan 02, 2023 | 9:04 AM

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని నందంగనిరాజు జంక్షన్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన నాయకుడు వై.శ్రీను పుట్టినరోజు వేడుకల సందర్భంగా.. పెద్ద ఘర్షణ వాతావరణమే చెలరేగింది. ఓ వైపు న్యూఇయర్ వేడుకలు.. మరోవైపు తమ పార్టీ నేత పుట్టినరోజు ఉండటంతో.. జనసేన కార్యకర్తలు ఫుల్ సెలబ్రేషన్స్‌లో ఉన్నారు. ఈ వేడుకలకు మహాసేన రాజేష్ కూడా హాజరయ్యారు. అయితే ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు అక్కడకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అతని కారుపై దాడి చేశారు. అద్దాలు ధ్వంసం చేశారు.

ఇంతలో జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాలకు సర్దిచెప్పేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేశారు. రాజేష్‌ను అక్కడ నుంచి పంపించేశారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే తమ పార్టీ నేతకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాజేష్‌పై దాడి చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు జనసేన నేతలు.

అయితే తమ పార్టీతో పాటు నాయకులపై సోషల్ మీడియాలో ఇష్టారీతిన వీడియోలు చేస్తుండటంతోనే దాడి చేశామని అంటున్నారు వైసీపీ కార్యకర్తలు. ఇప్పటికైనా అలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ