AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YSRCP: వైసీపీ 8వ జాబితా విడుదల.. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి..

వైసీపీ ఎనిమిదో జాబితా విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అడుగులు ముందుకు వేస్తోంది. అందులో భాగంగానే ఏడు జాబితాలలో ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించింది. దాదాపు 60 మందికి పైగా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల పేర్లు వెల్లడించింది. అయితే తాజాగా మరో 3 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలకు ఇన్‌ఛార్జ్‌ల ప్రకటిస్తూ ఎనిమిదవ జాబితా విడుదల చేసింది. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా కిలారు రోశయ్యను నియమించింది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం.

YSRCP: వైసీపీ 8వ జాబితా విడుదల.. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి..
Ap Ysrcp
Srikar T
|

Updated on: Feb 28, 2024 | 10:33 PM

Share

వైసీపీ ఎనిమిదో జాబితా విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అడుగులు ముందుకు వేస్తోంది. అందులో భాగంగానే ఏడు జాబితాలలో ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించింది. దాదాపు 60 మందికి పైగా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల పేర్లు వెల్లడించింది. అయితే తాజాగా మరో 3 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలకు ఇన్‌ఛార్జ్‌ల ప్రకటిస్తూ ఎనిమిదవ జాబితా విడుదల చేసింది. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా కిలారు రోశయ్యను నియమించింది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం. కిలారి రోశయ్య సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పొన్నూరుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అంబటి మురళిని నియమించింది. ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి సోదరుడు అంబటి మురళికి పొన్నూరు నుంచి అవకాశం కల్పించింది. గతంలో ఎంపీ అభ్యర్థిగా అనుకున్న ఉమ్మారెడ్డి వెంకట రమణ స్థానంలో కిలారి రోశయ్యను పంపించింది.  అలాగే  కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ పేరును ఖరారు చేసింది. ఇక జి.డి.నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా కల్లత్తూర్‌ కృపాలక్ష్మికి అవకాశాన్ని ఇస్తూ ప్రకటన చేసింది వైసీపీ.

అయితే తాజాగా విడుదల చేసిన జాబితాలో కొందరు అభ్యర్థులను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జీడి నెల్లూరు వైసీపీ అభ్యర్థిని మళ్లీ మార్చారు. జీడి నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నారాయణస్వామిని చిత్తూరు పార్లమెంటుకు పంపిస్తూ కీలక మార్పులు చేశారు. ఈసారి డిప్యూటీ సిఎం నారాయణస్వామి కూతురుకు అవకాశం కల్పించారు. చిత్తూరు పార్లమెంటు నుంచి పోటీకి విముఖత చూపడంతో తిరిగి జీడీ నెల్లూరు అసెంబ్లీ స్థానాన్ని ఖరారు చేసిన వైసీపీ హై కమాండ్. 8వ జాబితాలో నారాయణస్వామి కాకుండా ఆయన కుమార్తెకు టికెట్ కేటాయించిన వైసీపీ అధిష్టానం. అలాగే కొత్త అభ్యర్థిగా కళత్తూరు కృపాలక్ష్మిని నియమించారు. వైసీపీ గుంటూరు పార్లమెంటు సమన్వయకర్తను కూడా మారుస్తూ వైసీపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి