YSRCP: ఆ జిల్లాలో వైసిపిని వీడుతున్న కీలక నాయకులు.. టీడీపీకి మైలేజ్ పెరిగేనా..?
ఆ జిల్లా వైసిపికి కంచుకోట.. నిన్నటిదాకా ప్రజాబలం మెండుగా ఉన్న ఆ జిల్లాలో కొన్ని తప్పిదాలు, పరిస్థితులు తారుమారు అవుతున్నాయా.. పార్టీ చేజేతులా గట్టి నాయకత్వాన్ని దూరం చేసుకుంటోందా అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బలమైన సామాజికవర్గం నుంచి పార్టీని వీడి టిడిపిలో చేరుతున్నారు. దీన్ని అధికార వైసిపి ఎలా సెట్ చేసుకోబోతోంది. కోటంరెడ్డితో మొదలైంది.. ఇప్పుడు వేమిరెడ్డి దాకా వచ్చింది. అంతటితో ఆగుతుందా.. ఇంకా పార్టీని వీడే పెద్ద రెడ్ల లిస్ట్ ఉందా. వైసిపికి స్ట్రాంగ్ అనుకున్న నెల్లూరు జిల్లాలో ఎందుకు పాలిటిక్స్ ఇంతా వేగంగా మారుతున్నాయి.
ఆ జిల్లా వైసిపికి కంచుకోట.. నిన్నటిదాకా ప్రజాబలం మెండుగా ఉన్న ఆ జిల్లాలో కొన్ని తప్పిదాలు, పరిస్థితులు తారుమారు అవుతున్నాయా.. పార్టీ చేజేతులా గట్టి నాయకత్వాన్ని దూరం చేసుకుంటోందా అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బలమైన సామాజికవర్గం నుంచి పార్టీని వీడి టిడిపిలో చేరుతున్నారు. దీన్ని అధికార వైసిపి ఎలా సెట్ చేసుకోబోతోంది.
కోటంరెడ్డితో మొదలైంది.. ఇప్పుడు వేమిరెడ్డి దాకా వచ్చింది. అంతటితో ఆగుతుందా.. ఇంకా పార్టీని వీడే పెద్ద రెడ్ల లిస్ట్ ఉందా. వైసిపికి స్ట్రాంగ్ అనుకున్న నెల్లూరు జిల్లాలో ఎందుకు పాలిటిక్స్ ఇంతా వేగంగా మారుతున్నాయి. ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ. తాజా పరిణామాలతో వైసిపి నేతల్లో అంతర్మధనం.. టిడిపిలో కొత్త ఉత్సాహం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారంటూ నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసింది వైసిపి. అయితే అంతకంటే ముందే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీకి రెబల్‌గా మారారు. అభివృద్ధి కోసం తన ప్రయత్నాలు ఫలించడం లేదంటూ తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత మరో ఎమ్మెల్యే, సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి కూడా సేమ్ రీజన్‌తో పార్టీపై విమర్శలు చేశారు. ఆ తర్వాత పార్టీ తనకు అన్యాయం చేస్తోందంటూ ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీపై ఆరోపణలు చేయడంతో జిల్లాలో అది కూడా బలమైన రెడ్డి సమాజికవర్గం నుంచే వ్యతిరేకతలు రావడం సంచలనంగా మారింది.
ఇక ఇంతటితో వలసలు అగాయి అనుకుంటుండగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిర్ణయంతో పెద్ద బ్లాస్ట్ అయింది. నెల్లూరు పార్లమెంట్ ఇంచార్జ్‌గా ఉన్న వేమిరెడ్డి తనకు సరైన గౌరవం దక్కడం లేదంటూ ఒక్కసారిగా కార్యక్రమాలను ఆపేసి వెళ్లిపోయారు. దీంతో వైసీపీ పెద్దలు ఒప్పించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఇంతలోనే టిడిపి స్పీడ్ పెంచింది. వేమిరెడ్డిని పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నంలో సక్సెస్ అయ్యింది. మాజీమంత్రి నారాయణ నేతృత్వంలో వేమిరెడ్డి ఎంట్రీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చి 2న వేమిరెడ్డి దంపతులు ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి పార్టీలో చేరనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేమిరెడ్డికి చెందిన నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్‌లో చంద్రబాబు సుమక్షంలో చేరిక ఉండబోతోంది. అయితే కోటంరెడ్డి, ఆనం, మేకపాటి, తాజాగా వేమిరెడ్డి దంపతులు.. వైసిపి నుంచి వలసలు ఇంతటితో ఆగుతాయా.. ఇంకా ఏమైనా సంచలనాలు ఉంటాయా.. అన్న చర్చ జరుగుతోంది. వైసీపీలో ఉన్న మరి కొందరు సీనియర్లు కూడా పార్టీని వీడనున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. అదే జరిగితే ఇప్పటిదాకా వైసీపీకి వన్ సైడ్‌గా ఉన్న జిల్లాలో పరిస్థితి టిడిపికి కలిసొస్తుందన్న డిస్కషన్ మొదలైంది. మరి డ్యామేజ్ కంట్రోల్‌గా వైసీపీ ఎం చేస్తుందో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..