AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కన్న బిడ్డల ఎదుటే తల్లిపై కత్తితో దాడి.. అనంతరం యువకుడు ఆత్మహత్య

వివాహితపై ఓ స్నేహితుడు దాడి చేసిన ఘటనల కలకలం రేపుతోంది. కన్న బిడ్డల ఎదుటే మహిళపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు ఒక యువకుడు. ఈ ఘటనను చూసిన చిన్నారులు ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. బిగ్గరగా పెద్ద పెద్ద కేకలు పెట్టారు. కాస్త ఆలస్యంగా గుర్తించిన స్థానికలు.. చిన్నారులను బయటకు తీసుకువచ్చి పోలీసులకు సమాచారం అందించారు.

Andhra Pradesh: కన్న బిడ్డల ఎదుటే తల్లిపై కత్తితో దాడి.. అనంతరం యువకుడు ఆత్మహత్య
Crime
M Sivakumar
| Edited By: Balaraju Goud|

Updated on: Feb 28, 2024 | 1:27 PM

Share

వివాహితపై ఓ స్నేహితుడు దాడి చేసిన ఘటనల కలకలం రేపుతోంది. కన్న బిడ్డల ఎదుటే మహిళపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు ఒక యువకుడు. ఈ ఘటనను చూసిన చిన్నారులు ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. బిగ్గరగా పెద్ద పెద్ద కేకలు పెట్టారు. కాస్త ఆలస్యంగా గుర్తించిన స్థానికలు.. చిన్నారులను బయటకు తీసుకువచ్చి పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితిలోకి వెళ్లిన మహిళను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన దంపతులు మాధురి(37), పవన్ కుమార్ గుడివాడలో స్థిరపడ్డారు. వీరికి జోషిత్ సాయి (10), యువిక (5) అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. గుడివాడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో బాధితురాలు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. నాని అనే యువకుడుతో పరిచయం ఏర్పడింది. అనంతరం ప్రేమిస్తున్నానంటూ యువకుడు ఆమె వెంటపడుతూ వేధిస్తున్నాడు. దీంతో భర్త, ఇతర బంధువులకు చెప్పి వారం రోజుల క్రితం బాధితురాలు గుడివాడ నుంచి విజయవాడకు బదిలీ చేయించుకుంది.

విజయవాడ దుర్గాపురంలోని ప్రైవేటు పాఠశాలలో చేరింది. లక్ష్మీనగర్ లోని తల్లి కనకదుర్గ వద్ద ఉంటోంది. మాధురి తన ఇద్దరు పిల్లలతో కలిసి మంగళవారం పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఇంట్లో నుంచి పిల్లలు కేకలు వేస్తుండడంతో చుట్టుపక్కల వారు విన్నారు. పిల్లలు చదవక పోవటంతో తల్లి దండిస్తుందనుకుని ఊరుకున్నారు. ఎంత సేపటికీ పిల్లలు ఏడుపులు, కేకలు ఆపకపోవడంతో.. ఇంటి యజమానురాలు కంగారుపడి కిటికీలో నుంచి చూశారు. రక్తపు మడుగులో ఉన్న మాధురి, పక్కనే ఏడుస్తున్న పిల్లలను చూసి తలుపులు తీసేందుకు ప్రయత్నించారు. లోపల నుంచి గడియ పెట్టి ఉండడంతో.. పక్కింటికి వీరి సాయంతో తలుపును బలవంతంగా తెరిచి లోపలికి వెళ్లారు. ఇంట్లో ఉరేసుకున్న గుర్తు తెలియని ఓ యువకుడిని చూసి మరింత కంగారుపడ్డారు. భయపడిపోయిన పిల్లలను తీసుకుని బయటకు వచ్చారు. అనంతరం సత్యనారాయణపురం పోలీసులకు సమాచారం అందించారు..

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలతో పడి ఉన్న మాధురిని హుటాహుటిన పోలీసు జీపులోనే ఆసుపత్రికి తరలించారు. పిల్లల నుంచి వివరాలు సేకరించారు. అమ్మతో గొడవ పడి, కత్తితో నరికాడని చిన్నారులు వివరించారు. ఆ తర్వాత వైరుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు యువకుడు. మాధురి చేతిపై పలు చోట్ల గాయాలున్నట్లు వైద్యులు వెల్లడించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పక్కా ప్లాన్ ప్రకారమే హత్యకు ప్లాన్క్ చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. గుడివాడలో ఉంటున్న నాని.. తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలంటూ మాధురిని వేధించేవాడని బంధువులు చెబుతున్నారు. దీంతో భయపడిపోయిన ఆమె, విజయవాడకు వచ్చేసిందని అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న నాని.. మంగళవారం సాయంత్రం వీరింటికి వచ్చాడు. మాట్లాడదామని చెప్పి, లోపల గడియ వేశాడు. గొడవ పెట్టుకుని తనతో పాటు తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. గదిలో రక్తం మడుగు కట్టింది. ఈ ఘటన చూసిన పిల్లలు భయాందోళనలతో కేకలు వేశారు.

అయితే మాధురి చనిపోయిందనుకుని నాని తనతో పాటు తెచ్చుకున్న ప్లాస్టిక్ వైరుతో ఉరేసుకున్నాడు. పక్కా ప్రణాళికతో ఆమెను చంపాలనే ఆలోచనతోనే కత్తి, తాడు తీసుకొచ్చాడని పోలీసులు భావిస్తున్నారు. బాధితురాలు గతంలోనే నానిపై గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని, కేసు నమోదైనట్లు తెలిసింది. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. మాధురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…