Srisailam: మహా శివరాత్రి వేళ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి బంగారు, వెండి విరాళాల వెల్లువ
1 కేజీ 25 గ్రాముల బరువుతో ఒక వెండి పళ్ళెం, 865 గ్రాముల బరువు గల ఒక మరో వెండి పళ్ళెం, 550 గ్రాముల బరువుగల వెండి నాగహారతి, 290 గ్రాముల బరువుగల వెండి శక్తి ఆయుధం, 420 గ్రాముల బరువుగల కుక్కుటధ్వజం,750 గ్రాముల బరువు 5 వెండి గిన్నెలు, 920 గ్రాముల బరువు గంధాక్షత గిన్నె, 190 గ్రాముల బరువుగల చిన్న వెండి కమండలం, 300 గ్రాముల బరువుగల పెద్ద కమండలాన్ని (పెద్దది) దేవస్థానానికి విరాళంగా అందజేశారు.

మహాశివరాత్రి సమీపిస్తున్న వేళ.. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి బంగారు, వెండి విరాళాల వెల్లువెత్తుతున్నాయి. నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్నకు భక్తులు భూరి విరాళాలు అందజేస్తున్నారు. శ్రీశైలం దేవస్థానానికి అమెరికాకు చెందిన కొత్తపల్లి సునీల్ దత్, కుటుంబసభ్యులు బంగారం, వెండి సామాగ్రిని విరాళంగా అందజేశారు. విరాళంగా అందించిన వాటిలో 28 గ్రాముల 300 మిల్లీ గ్రాముల బరువుగల 2 బంగారు బాసికాలు, 5 గ్రాముల బరువుగల బంగారు కంకణం ఉన్నాయి.
అదే విధంగా 1 కేజీ 25 గ్రాముల బరువుతో ఒక వెండి పళ్ళెం, 865 గ్రాముల బరువు గల ఒక మరో వెండి పళ్ళెం, 550 గ్రాముల బరువుగల వెండి నాగ హారతి, 290 గ్రాముల బరువు గల వెండి శక్తి ఆయుధం, 420 గ్రాముల బరువు గల కుక్కుట ధ్వజం, 750 గ్రాముల బరువు 5 వెండి గిన్నెలు, 920 గ్రాముల బరువు గంధాక్షత గిన్నె, 190 గ్రాముల బరువుగల చిన్న వెండి కమండలం, 300 గ్రాముల బరువుగల పెద్ద కమండలాన్ని (పెద్దది) దేవ స్థానానికి విరాళంగా అందజేశారు.
అదే విధంగా ఎన్నారై భక్తులతో పాటు మరో విరాళ దాతలైన నంద్యాలకు చెందిన కౌలురి సింధూర కూడా వెండి వస్తువులను సమర్పించారు. వీటిలో 810 గ్రాముల బరువు గల వెండిపళ్ళెం, 350 గ్రాముల బరువుగల వెండిపళ్లెం, 615 గ్రాముల బరువుగల 3 వెండి చెంబులను విరాళంగా అందజేశారు. ఇరువురు దాతలు అమ్మవారి ఆలయ ప్రాంగణములోని ఆశీర్వచన మండపంలో అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు మార్కండేయ శాస్త్రి స్థానాచార్యులు పూర్ణానందం, అమ్మవారి ఆలయ అధికారులకు బంగారు, వెండి వస్తువులను అందజేశారు. అనంతరం బంగారం, వెండి అందజేసిన దాతలకు శ్రీస్వామి అమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలు ఆలయ అధికారులు అందజేశారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








