Kuppam Politics: కుప్పంలో నీరు నిప్పు.. వైసీపీ – టీడీపీ మద్య హంద్రీనీ’వార్’.. పేలుతున్న మాటల తూటాలు
కుప్పంలో హంద్రీనీవా రాజకీయం వేడెక్కింది. కుప్పంకు నీళ్లు ఇచ్చిన క్రెడిట్ తమదేనంటున్న వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కృష్ణా జలాలను కుప్పంనకు తీసుకొచ్చింది జగన్ అని వైసీపీ, 90 శాతం పనులు పూర్తి చేసింది చంద్రబాబేనంటున్న టీడీపీ ఇలా అధికార ప్రతిపక్ష పార్టీల మద్య వార్ పీక్స్‌కు చేరింది.
కుప్పంలో హంద్రీనీవా రాజకీయం వేడెక్కింది. కుప్పంకు నీళ్లు ఇచ్చిన క్రెడిట్ తమదేనంటున్న వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కృష్ణా జలాలను కుప్పంనకు తీసుకొచ్చింది జగన్ అని వైసీపీ, 90 శాతం పనులు పూర్తి చేసింది చంద్రబాబేనంటున్న టీడీపీ ఇలా అధికార ప్రతిపక్ష పార్టీల మద్య వార్ పీక్స్‌కు చేరింది. హంద్రీ నీవా నీళ్లు మంటలుగా మారడంతో కుప్పం వాటర్ పాలిటిక్స్ కు వేదికైంది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం పాలిటిక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన తర్వాత మరింత హీట్‌గా మారాయి. హంద్రీనీవా నీటి వ్యవహారం టీడీపీ – వైసీపీలకు రాజకీయ ఆయుధంగా మారింది. కుప్పంకు నీళ్లు ఇచ్చిన క్రెడిట్ తమదేనంటున్న వైసీపీ, వైసీపీ ది షోఅప్ అంటున్న టీడీపీ. ఇలా రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా కుప్పంలో పర్యటించిన సీఎం హంద్రీనీవా నీటిని కుప్పంకు అందించడంతో హంద్రీనీవా ఇష్యూ హాట్ టాపిక్ గా మారిపోయింది.
672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం నుంచి కృష్ణమ్మను కుప్పంకు తీసుకొచ్చామన్నారు సీఎం వైఎస్ జగన్. కుప్పంకు నీళ్లు ఇచ్చి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా మన్నారు. 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా మూడు సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఎందుకు కుప్పంకు నీళ్లు తీసుకుని రాలేదని ప్రశ్నించడంతో ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన సందర్భమన్న సీఎం ఎంతో గర్వపడుతున్నా నన్నారు. లాభాలు ఉన్న పనులే చంద్రబాబు చేశారని ఇది వరకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానన్నారు. మరో రెండు రిజర్వాయర్ల నిర్మాణంకు శ్రీకారం చుట్టామని సీఎం జగన్ తెలిపారు..
కుప్పంలో ఒక టిఎంసి సామర్థ్యంతో రెండు రిజర్వాయర్లను రూ. 535 కోట్ల రూపాయలతో నిర్మిస్తామన్నారు. అదనంగా మరో 5 వేల ఎకరాలకు సాగు నీరు లభిస్తుందని, 35 ఏళ్లుగా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా, మూడు సార్లు సీఎంగా ఎన్నికైన చంద్రబాబు ఎందుకు కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేయలేక పోయారని సీఎం ప్రశ్నించారు. కుప్పంకే ప్రయోజనం లేని నాయకుడు వల్ల రాష్ట్రానికి ఏమి ప్రయోజనం జరుగుతుందన్న సీఎం. తనకు భారీ వాటాలు ఇచ్చే వారికే ఈ ప్రాజెక్ట్ పనులు ఇవ్వాలని చంద్రబాబు ఆలోచన చేశాడన్నారు. ఎంతో చిత్తశుద్దితో ఈ పనులు మేము పూర్తి చేశామన్నారు సీఎం జగన్.
ఇక కుప్పంలో సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ కౌంటర్ అటాక్ ఇస్తోంది. కుప్పంకు హంద్రీనీవా క్రెడిట్ తమాడేనంటున్న వైసీపీపై మండిపడుతోంది. కుప్పంకు హంద్రీనీవా జలాలు నేనే తెచ్చా అంటూ ప్రజలకు బూటకపు మాటలతో మోసం చేయవద్దని సీఎంకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేతలు. టీడీపీ ప్రభుత్వంలో వందల కిలోమీటర్లు కాలువ తవ్వి కుప్పంకు జల నిధిని అందించే ప్రయత్నం చంద్రబాబు చేశారన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో 30 కిలోమీటర్లు కూడా కాలువ తవ్వలేక పోయారని ఆరోపించారు టీడీపీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి.
పోలవరం ప్రాజెక్టును విస్మరించి కుప్పంకు నీళ్లు తీసుకురావడం సాధ్యమా అని ప్రశ్నించిన అమర్ ఎన్నికలు దగ్గరవుతున్న వేళ మాటల గారడీ చెయ్యొద్దన్నారు. జగన్ రెడ్డి మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని కుప్పం అభివృద్ధి పేపర్ ప్రకటనకే పరిమితం అయ్యిందన్నారు. సీఎంగా చంద్రబాబు పులివెందులకు సైతం నీళ్ళు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకున్నారని గుర్తు చేశారు. ఇరిగేషన్ శాఖపై అవగాహన లేక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారన్నా మాజీ మంత్రి అమ..ర్ వైఫల్యాలను జనం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఐదేళ్లపాటు రివర్స్ గేర్ లో నడిచిన వైసీపీ సర్కార్ పర్యవసానంగా జగన్ కు రిటర్న్ గిఫ్ట్ కు కుప్పం ప్రజలు సిద్ధమవుతున్నారన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…