BJP: హిందూపురం నియోజకర్గ పార్లమెంట్ టికెట్ ఎవరికి.. పోటీలో కీలక అభ్యర్థులు..
ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ టికెట్ కోసం బీజేపీలో పోటీ నెలకొంది. ఓ వైపు సుదీర్ఘకాలం బీజేపీలోనే కొనసాగుతున్న నాయకుడు, మరోవైపు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసే స్వామిజీ ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏపీ బిజెపి ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, పరిపూర్ణానంద స్వామీజీ హిందూపురం నుంచి పోటీ చేయడానికి సన్నద్ధమవుతుండటంతో.. హిందూపురం ఎంపీ సీటు ఆసక్తికరంగా మారింది. ఏపీ బీజేపీలో సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడి వరకు ఎదిగిన విష్ణువర్ధన్ రెడ్డి హిందూపురం బీజేపీ ఎంపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ టికెట్ కోసం బీజేపీలో పోటీ నెలకొంది. ఓ వైపు సుదీర్ఘకాలం బీజేపీలోనే కొనసాగుతున్న నాయకుడు, మరోవైపు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసే స్వామిజీ ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏపీ బిజెపి ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, పరిపూర్ణానంద స్వామీజీ హిందూపురం నుంచి పోటీ చేయడానికి సన్నద్ధమవుతుండటంతో.. హిందూపురం ఎంపీ సీటు ఆసక్తికరంగా మారింది.
ఏపీ బీజేపీలో సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడి వరకు ఎదిగిన విష్ణువర్ధన్ రెడ్డి హిందూపురం బీజేపీ ఎంపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. హిందూపురం స్థానికుడైన తాను బీజేపీ ఎంపీ టికెట్ ఆశిస్తున్నానని తెలిపారు. 30 ఏళ్లుగా బీజేపీలో ఉంటున్న తనకు ఎంపీ టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తానంటున్నారు. పరిపూర్ణానంద స్వామి టికెట్ ఆశించడంలో ఎలాంటి తప్పులేదన్నారు.
హిందుస్థాన్‌కు మోదీజీ.. హిందూపురానికి స్వామీజీ అంటూ పరిపూర్ణానంద స్వామి కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక స్వామీజీ ఎంపీ అయితే అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తానంటున్నారు పరిపూర్ణానంద. తనకు టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇలా హిందూపురం ఎంపీ సీటు కోసం ఓ వైపు బీజేపీ నాయకుడు, మరోవైపు స్వామిజీ పోటీపడుతుండటంతో.. బీజేపీ అధినాయకత్వం ఎవరి వైపు మొగ్గుచూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..