Watch Video: తీర్థయాత్రలకు వాళ్లిన కుటుంబం.. అర్థరాత్రి ఇంట్లో బీభత్సం.. పోలీసులకు పక్కింటోళ్ల సమాచారం..
నంద్యాల గడ్డ దొంగలకు అడ్డాగా మారింది అంటే అవుననే చెప్పాలి. వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు దొంగలు. పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్లో తాళం వేసిన ఇంట్లో చోరికు పాల్పడ్డారు. ఇంటికి తాళం వేసి భార్య,భర్తలు తీర్ధయాత్రకు వెళ్ళారు. విషయం గమనించిన దొంగలు ప్రధాన రహదారిపై ఉన్న ఇంటికి వేసిన తాళం పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. ఇంటి యజమానులు వస్తే ఇంట్లో ఎంత నగదు, బంగారుం అపహరణకు గురైంది అనే విషయం తేలనుంది.

చోరికి గురైన విషయం గమనించిన పక్కింటి వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలం చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీం ద్వారా దొంగల అధారాలు సేకరిస్తూన్నారు. గత కొన్ని నెలలుగా పట్టణంలోను ప్రధాన రహదారులలో గల ఇండ్లు, షాపులు, క్లాత్ షోరూం, వైన్స్, టీ షాపుల్లో చోరీకి పాల్పడటం సంచలనంగా మారింది. వరుస చోరీలు పోలీసులకు తలనొప్పిగా మారింది. దొంగలు ముసుగు ధరించి దొంగతనాలకు పాల్పడుతుండటంతో దొంగలను గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది. దొంగలను త్వరగా పట్టుకోవాలని బాధితులు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..