PM Modi: తమిళనాడులో ప్రధాని మోదీ పర్యటన.. పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవం..

Srikar T

|

Updated on: Feb 28, 2024 | 3:47 PM

తమిళనాడులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు ప్రధాని మోదీ. తూత్తుకుడి కేంద్రంగా నిర్మించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజెన్‌ హబ్‌ పోర్ట్‌ను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టుల్లో ఔటర్‌ హార్బర్‌, కంటైనర్‌ టెర్మినల్స్‌ కూడా ఉన్నాయ్‌. మొత్తంగా 17వేల కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులు మోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి.

కులశేఖరపట్టణంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. రెండో అంతరిక్ష నౌకాశ్రయానికి శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. 2వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ స్పేస్‌పోర్ట్‌ను ఏర్పాటు చేయనున్నారు. శ్రీహరికోటకు ప్రత్యామ్నాయంగా దీన్ని నిర్మిస్తున్నారు. శ్రీహరికోట కంటే కులశేఖరపట్టణం.. భూమధ్యరేఖకు దగ్గరగా ఉండటంతో రాకెట్‌ విడిభాగాల రవాణా మరింత ఈజీకానుంది. సమయం, ఖర్చు రెండూ తగ్గనున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..