Andhra Pradesh: మాయమాటలు చెప్పి ముళ్లపొదల్లోకి తీసుకెళ్ళాడు.. బాలికపై వృద్ధుడి అఘాయిత్యం..
Prakasam district news: మానసిక దివ్యాంగురాలైన ఓ బాలికపై 73 ఏళ్ళ వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడిన దారుణ ఘటన ఏపీలో కలకలం రేపింది.. మనుమరాలి వయస్సున్న బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఆ వృద్ధుడిని ప్రకాశం పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.

Prakasam district news: మానసిక దివ్యాంగురాలైన ఓ బాలికపై 73 ఏళ్ళ వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడిన దారుణ ఘటన ఏపీలో కలకలం రేపింది.. మనుమరాలి వయస్సున్న బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఆ వృద్ధుడిని ప్రకాశం పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం సిద్దినాయునిపాలెంలో మానసిక దివ్యాంగురాలు (17) తల్లితో కలిసి ఉంటోంది. తన తల్లితో కలిసి సాయంత్రం 5 గంటల సమయంలో సైకిల్‌పై స్థానిక అంగన్వాడీ కేంద్రం దగ్గరకు వెళ్ళింది.. అదే గ్రామానికి చెందిన 73 ఏళ్ళ వృద్దుడు రుద్రపాటి చిన్న వెంకటచెన్నయ్య ఆమెతో మాటలు కలిపాడు. కుశలప్రశ్నలు వేస్తున్నట్టు నటించి, అనంతరం మాయమాటలు చెప్పి ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాలిక ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి ఆమెను వెతుక్కుంటూ వెళ్ళింది… అంగన్‌వాడీ కేంద్రానికి సమీపంలో ముళ్ళపొదల్లో వెతికింది.. అక్కడ వృద్ధుడి చెరలో ఉన్న బాలిక కన్పించింది. ఆమె కేకలు వేయడంతో స్థానికులు చుట్టుముట్టి వృద్దుడ్ని పట్టుకునే క్రమంలో తప్పించుకుని పారిపోయాడు. ఈ ఘటనపై బాలిక తల్లి పెద్దారవీడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై పులి రాజేష్ నిందితుడిపై అత్యాచారం, ఫోక్సో సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
దర్యాప్తులో భాగంగా డీఎస్పీ వీర రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందంతో గాలింపు చర్యలు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం మార్కాపురం అదనపు మొదటి తరగతి ఇన్ఛార్జి న్యాయమూర్తి ఎమ్.ఎస్ కరీముల్లా ముందు హాజరుపరచగా, నిందితుడికి రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు అతడిని మార్కాపురం ఉపకారాగారానికి తరలించారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..