AP Inter Admissions: ఆగస్టు 17తో ముగుస్తోన్న ఏపీ ఇంటర్మీడియట్ చివరి విడత అడ్మిషన్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికిగానూ ఇంటర్మీడియట్ మూడో విడత ప్రవేశాల గడువు ఆగస్టు 17వ తేదీతో ముగుస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ బుధవారం (జులై 19)..
అమరావతి, జులై 20: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికిగానూ ఇంటర్మీడియట్ మూడో విడత ప్రవేశాల గడువు ఆగస్టు 17వ తేదీతో ముగుస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ బుధవారం (జులై 19) పేర్కొన్నారు. ఇదే చివరి విడత అని, మరోసారి గడువు పొడిగింపు ఉండదని ఆయన స్పష్టం చేశారు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మే 15 నుంచి జూన్ 14 వరకు మొదటి విడత ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జరిగింది. జూన్ 14తో మొదటి విడత ప్రవేశాలు, జులై 15 వరకు రెండో విడత ప్రవేశాలు జరిగాయి. ప్రస్తుతం చివరి విడత ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి రాత పరీక్షలు నిర్వహించకుండా కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే ఇంటర్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తున్న సంగతి తెలిసిందే.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.