AP MBBS Admissions: ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచి దరఖాస్తులు
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య, దంత మెడికల్ కాలేజీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్/బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు విజయవాడలోని డాక్టర్ వైఎస్‌ఆర్ హెల్త్..
విజయవాడ, జులై 20: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య, దంత మెడికల్ కాలేజీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్/బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు విజయవాడలోని డాక్టర్ వైఎస్‌ఆర్ హెల్త్ యూనివర్సిటీ బుధవారం (జులై 19) రాత్రి ప్రకటన వెలువరించింది. నీట్ (యూజీ)-2023 అర్హత సాధించిన అభ్యర్థులు గురువారం (జులై 20) ఉదయం 11 గంటల నుంచి జులై 26వ తేదీ సాయంత్రం 6 గంటల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వర్సిటీ తన ప్రకటనలో పేర్కొంది.
ముఖ్యమైన తేదీలు, ఇతర మార్గనిర్దేశకాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. కాగా రాష్ట్రానికి చెందిన 68,578 మంది అభ్యర్థులు నీట్ యూజీ 2023 పరీక్ష రాయగా.. వారిలో 42,836 మంది అర్హత సాధించారు. వీరంతా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికా రెడ్డి సూచించారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.