AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వృద్ధురాలు, మనవడిని బంధించి.. ఇంట్లో డబ్బు, బంగారు నగలు చోరీ!

Visakhapatnam Kancharapalem House Robbery: కంచరపాలెం ఇందిరానగర్ లో దోపిడీ దొంగల బీభత్సం కలకలం రేపింది. ఓ ఇంట్లో వృద్ధురాలు, ఆమె మనవడిని బంధించిన దొంగలు నగదు, బంగారం అపహరించారు. మొత్తం13 తులాల బంగారం, 3 లక్షల నగదు దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. వెళ్తూ వెళ్తూ ఇంట్లో ఉన్న కారు తాళం తీసుకొని కారుతో సహా పరారయ్యారు..

వృద్ధురాలు, మనవడిని బంధించి.. ఇంట్లో డబ్బు, బంగారు నగలు చోరీ!
Kancharapalem House Robbery
Srilakshmi C
|

Updated on: Oct 06, 2025 | 11:30 AM

Share

విశాఖపట్నం, అక్టోబర్ 6: విశాఖపట్నం కంచరపాలెం ఇందిరానగర్ లో దోపిడీ దొంగల బీభత్సం కలకలం రేపింది. ఓ ఇంట్లో వృద్ధురాలు, ఆమె మనవడిని బంధించిన దొంగలు నగదు, బంగారం అపహరించారు. మొత్తం13 తులాల బంగారం, 3 లక్షల నగదు దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. వెళ్తూ వెళ్తూ ఇంట్లో ఉన్న కారు తాళం తీసుకొని కారుతో సహా పరారయ్యారు. మొత్తం ముగ్గురు దొంగలు వచ్చినట్టు గుర్తింపు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకెళ్తే..

విశాఖపట్నం కంచరపాలెం ఇందిరానగర్ లో ఎల్లయమ్మ, ఆమె మనవడు కృష్ణ కాంత్ నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి ఒంటిగంటన్నర సమయంలో ఇంటి వెనుక వైపు నుంచి ముగ్గురు దొంగలు ఎల్లయమ్మ ఇంట్లో చొరబడ్డారు. ఎల్లయమ్మ బెడ్ రూమ్‌లో నింద్రించగా.. మనవడు హాల్లో పడుకున్నాడు. ముఖాలకు మాస్కులు పెట్టుకుని ఉన్న ముగ్గురు దుండగులు ముందుగా దొంగలు ఎల్లయమ్మ వద్దకు వచ్చి ఆమె రెండు చేతులు కట్టేశారు. అనంతరం అరవకుండా ముఖానికి ప్లాస్టర్ అంటీంచారు. ఆమె చేతికి ఉన్న బంగారు గాజులన్నీ తీసుకున్నారు. అనంతరం బీరువా ఓపెన్ చేసి అందులోని నగదు, నగలు తీసుకున్నట్లు బాదితురాలు ఎల్లయమ్మ తెలిపింది.

ఆ తర్వాత హాల్లో నిద్రిస్తున్న ఆమె మనవడు కృష్ణ కాంత్ దగ్గరకు వచ్చి దాడి చేశారు. చేతుల కట్టి.. డైమండ్ ఉందని తీసుకున్నారు. ఆరాలని తీసేందుకు కృష్ణకాంత్‌ ప్రయత్నించగా అతడిపై మరోసారి దాడి చేశారు. వచ్చిన ముగ్గురు హిందీలో మాట్లాడుతున్నారని అతడు తెలిపాడు. వెళ్లేటప్పుడు ఇంట్లో ఉన్న కారు తాళాలు తీసుకొని కారులో పారిపోయినట్లు వివరించాడు. మా నాన్న హైదరాబాద్ వెళ్లారు. ఘటన జరిగిన వెంటనే నేను పోలీసులకు కాల్ చేశాను. వెంటనే పోలీసులు వచ్చి వెరిఫై చేశారు. బయట రాష్ట్రానికి చెందిన ముఠాగా అనిపిస్తోందని మనవడు కృష్ణ కాంత్ పోలీసులకు తెలిపాడు. దీనిపై క్రైమ్ ఎస్ఐ మహరూఫ్ మాట్లాడుతూ..

ఇవి కూడా చదవండి

ముగ్గురు దొంగలు హిందీలో మాట్లాడుతున్నట్టు బాధితులు చెప్పారు. ప్లాస్టిక్ వైర్లతో బంధించి నగదు, నగలు ఎత్తుకెళ్లారు. సిపి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. క్లూస్ టీం, డాగ్ స్కవాడ్ ఆధారాలను సేకరిస్తుంది. సీసీ ఫుటేజ్‌లను కూడా పరిశీలిస్తున్నాం. కారు మారిక వలస ప్రాంతంలో ఉన్నట్టు సమాచారం అందింది. నిందితులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారుగా అనుమానిస్తున్నాం. కొన్ని సందర్భాల్లో డైవర్ట్ చేసేందుకు లోకల్ గ్యాంగ్ కూడా హిందీలో మాట్లాడే అవకాశం లేకపోలేదు. సాధ్యమైనంత త్వరగా కేసును చేదిస్తామని ఆయన మీడియాకు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..