AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomato Price Today: ‘టమాటా’ ధరలు ఢమాల్‌.. కిలో కేవలం రూ.1 మాత్రమే! ఎక్కడంటే..

మార్కెట్లో మాత్రం టమాట ధరలు ఒక్కోసారి చుక్కలు చూపిస్తే.. మరోసారి నేల చూపులు చూస్తుంటాయి. ఏకంగా కిలో టమాట రూ.500 పలికిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం టమాట ధరలు అమాంతం పడిపోయాయి. ఏకంగా కిలో ఒక్క రూపాయి పలుకడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు..

Tomato Price Today: ‘టమాటా’ ధరలు ఢమాల్‌.. కిలో కేవలం రూ.1 మాత్రమే! ఎక్కడంటే..
Tomato Price At Pathikonda Wholesale Market
Srilakshmi C
|

Updated on: Oct 06, 2025 | 10:29 AM

Share

పత్తికొండ, అక్టోబర్ 6: వంటింట్లో టమాట లేనిదే చాలా మంది గృహిణులకు వంట పూర్తికాదు. అయితే మార్కెట్లో మాత్రం వీటి ధరలు ఒక్కోసారి చుక్కలు చూపిస్తే.. మరోసారి నేల చూపులు చూస్తుంటాయి. ఏకంగా కిలో టమాట రూ.500 పలికిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం టమాట ధరలు అమాంతం పడిపోయాయి. ఏకంగా కిలో ఒక్క రూపాయి పలుకడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో పరిస్థితి ఇదే. టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. పండగ ముందు వరకు కిలో రూ.8 నుంచి 10 పలకగా.. ఆదివారం మాత్రం ఒక్కసారిగా రూ.4కు పడిపోయింది. దీంతో ఆరుగాలం పడించిన పంటను రైతులు రోడ్డుపై పారబోశారు. మార్కెట్‌ కమీషన్‌తో పాటు కోత కూలీలు, రవాణా ఖర్చులు చెల్లించామని.. లాభం సంగతి పక్కనపెడితే కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చేలా లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

టమాటాలు అన్నీ రోడ్డుపై పారబోసి.. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో కొద్దిసేపు అక్కడ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గుత్తి-మంత్రాలయం రహదారిలో ట్రాఫిక్‌ ఏర్పడటంతో వాహనదారులు గందరగోళపడ్డారు. గిట్టుబాటు ధర కల్పించాలని రైతలు డిమాండ్ చేశారు. టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కూడా త్వరగానే పూర్తి చేయాలని అన్నారు. 10 కిలోల టమాటా గంపలు రెండింటికి కలిపి కేవలం రూ.80 నుంచి రూ.100 మధ్య ధర పలికిందని, మార్కెట్లో వ్యాపారులు 25 కిలోల గంపలను రెండింటిని రూ.180 కనిష్ఠ ధరకు కొన్నట్లు తెలిపారు.

దసరా పండగ కారణంగా అక్టోబర్‌ 1, 2 తేదీల్లో మార్కెట్‌కు ఇచ్చారు. దీంతో రెండు నుంచి కోతకు సిద్ధంగా ఉన్న పంటను మార్కెట్‌కు తరలించారు. ఒకే రోజు మొత్తం 5.5 టన్నులకుపైగా టమాటా అమ్మకానికి వచ్చాయి. దీంతో వ్యాపారులు అతి తక్కువ ధరకు టమాటాలను కొనుగోలు చేశారు. మార్కెట్‌ కమీషన్, కోత కూలీలు, రవాణా ఖర్చులు కూడా చేతినుంచే చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లెక్కన టమాటా కిలోకి కేవలం ఒక్క రూపాయి మాత్రమే చేతికి వచ్చిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు