AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Republic Day: మూడు జిలాల్లో త్రివర్ణ పతకంతో ర్యాలీ నిర్వహించిన టీచర్స్, స్టూడెంట్స్ .. అడుగడుగునా గౌరవ వందనం

కోనసీనమ జిల్లా నరసాపురాపేట నుంచి తన జర్నీని మొదలు పెట్టిన త్రివర్ణ పతాకం.. తూర్పుగోదావరి జిల్లా మెల్లూరు మీదుగా పయనించి.. కాకినాడ జిల్లా వెండ్ర వద్ద ముగించింది. 

Republic Day: మూడు జిలాల్లో త్రివర్ణ పతకంతో ర్యాలీ నిర్వహించిన టీచర్స్, స్టూడెంట్స్ .. అడుగడుగునా గౌరవ వందనం
National Flag In Konaseema
Surya Kala
|

Updated on: Jan 26, 2023 | 1:03 PM

Share

74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.  త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా అనపర్తిలో భారీ త్రివర్ణ పతాకం  రెపరెపలాడింది. మూడు జిల్లాలను తాకుతూ.. జాతీయ పతాకం సగర్వంగా ఊరేగింది. 250 అడుగులున్న త్రివర్ణ పతాకంతో  74వ గణతంత్ర వేడుకలను ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. కోనసీనమ జిల్లా నరసాపురాపేట నుంచి తన జర్నీని మొదలు పెట్టిన త్రివర్ణ పతాకం.. తూర్పుగోదావరి జిల్లా మెల్లూరు మీదుగా పయనించి.. కాకినాడ జిల్లా వెండ్ర వద్ద ముగించింది.

ఈ రిపబ్లిక్ డే వేడుకలు మోడరన్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగాయి. పల్లె గ్రామాలను కలుపుకుంటూ విద్యార్థులు, టీచర్స్ ర్యాలీ అత్యంత ఘనంగా జరిగింది. తమ గ్రామం మీదుగా పయనిస్తున్న త్రివర్ణ పrEPUBLICతాకానికి అడుగడుగునా గౌరవం దక్కింది.  జాతీయ జెండాకు గ్రామస్తులు, విద్యార్థులు వందనం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..