Boat Missing in US: అమెరికాలో పడవ ప్రమాదం.. 39 మంది గల్లంతు.. ప్రాణాలతో ఒకేఒక్కడు.. అక్రమ మానవ రవాణాగా అనుమానం..
Boat Missing in US: అమెరికా(America)లోని ఫ్లోరిడా(Florida) తీరంలో మంగళవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. కొంతమంది మనుషులను తీసుకుని వెళ్తున్న ఓ పడవ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయింది..
Boat Missing in US: అమెరికా(America)లోని ఫ్లోరిడా(Florida) తీరంలో మంగళవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. కొంతమంది మనుషులను తీసుకుని వెళ్తున్న ఓ పడవ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయింది. ఈ ఘటనలో 39 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం తీరప్రాంత అధికారులు వెతుకులాట ప్రారంభించారు. ఇదే విషయంపై అధికారులు స్పందిస్తూ.. ఈ పడవలో మానవ స్మగ్లింగ్‌కు జరుగుతున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ పడవ కరేబియన్ దేశమైన బహమాస్ నుంచి బయలుదేరినట్టు అధికారులు చెబుతున్నారు. పోర్టుపియర్స్‌కు తూర్పున 72 కిలోమీటర్ల దూరంలో పడవను పట్టుకొని వేలాడుతున్న ఓ వ్యక్తి వేలాడుతున్నాడు. అతడిని ఓ సమారిటన్ గుర్తించి అతడిని రక్షించడానికి.. అనంతరం పడవ మునిగిపోయిన విషయం మంగళవారం కోస్టుగార్డ్‌కు ఫోన్ చేసి సమాచారం అందిచాడని సముద్ర భద్రతా ఏజెన్సీ తెలిపింది.
మియామీకి తూర్పున 50 మైళ్ల (80 కి.మీ) దూరంలో ఉన్న బహామాస్ బిమిని దీవుల నుండి 39 మంది వ్యక్తులతో శనివారం రాత్రి పడవలో బయలుదేరినట్లు ప్రాణాలతో బయటపడిన వ్యక్తి అధికారులకు తెలిపినట్లు కోస్ట్ గార్డ్ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసింది. అంతేకాదు ఈ ప్రమాదం ఫ్లోరిడాలోని అట్లాంటిక్ తీరంలో ఫోర్ట్ పియర్స్ ఇన్‌లెట్‌కు మయామి మరియు కేప్ కెనావెరల్ మధ్యలో జరిగినట్లు.. ఇక్కడకు పడవ వచ్చిన తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిందని.. అలలతాకిడికి ఓడ బోల్తా పడిందని చెప్పాడు. అంతేకాదు ఈ ప్రమాదం జరిగిన సమయంలోకానీ.. ఓడలో ప్రయాణంలో చేస్తున్న సమయంలో కూడా ప్రయాణీకులు ఎవరూ లైఫ్ జాకెట్ ధరించాలేదని చెప్పాడు. అయితే ప్లోరిడా సముద్ర తీరం స్మగ్లర్లకు, మనవ అక్రమ రవాణా కేంద్రంగా మారిందని కోస్ట్ గార్డ్ అధికారి హెర్నాండెజ్ చెప్పారు.