Srinagar: తొలిసారిగా లాల్ చౌక్ లో త్రివర్ణ పతాకం రెపరెపలు.. భారతదేశంలో ఉన్నామనే భావన కలుగుతుంది అంటూ స్థానికులు హర్షం..
Srinagar: 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు(Republic Day2022) దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అయితే ఈ సారి రిపబ్లిక్ డే వేడుకల్లో అరుదైన సంఘటన ఆవిష్కృతమైంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని..
Srinagar: 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు(Republic Day2022) దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అయితే ఈ సారి రిపబ్లిక్ డే వేడుకల్లో అరుదైన సంఘటన ఆవిష్కృతమైంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చరిత్రలో తొలిసారిగా జమ్ముకశ్మీర్(jammu Kashmir)లోని శ్రీనగర్(Srinagar)లోని ప్రసిద్ధ లాల్ చౌక్ ప్రాంతంలోని క్లాక్ టవర్(Clock Tower)పై భారత త్రివర్ణ పతాకాన్ని(Indian National Flag)ను ఆవిష్కరించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ చారిత్రక క్లాక్ టవర్‌పై జాతీయ జెండాను ఆవిష్కరించడం ఇదే తొలిసారి. లాల్ చౌక్ ప్రాంతంలో స్వచ్ఛంద సంస్థలు, పరిపాలనఅధికారులతో పాటు స్థానికులు జెండాను ఎగురవేశారు. సామాజిక కార్యకర్తలు సాజిద్ యూసఫ్ షా, సాహిల్ బషీర్ భట్‌లు క్రేన్ సాయంతో క్లాక్ టవర్‌పై జాతీయ జెండాను ఎగరవేశారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ ఐకానిక్ క్లాక్ టవర్‌పై జనవరి 26న పాకిస్థాన్ జెండాను ఎగురవేయడం లేదా సెక్షన్ 144 విధించడం సర్వసాధారణంగా జరుగుతుండేది. అయితే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కూడా లాల్ చౌక్‌లో మువ్వెన్నెల జెండాను ఎగురవేసేందుకు అనుమతి ఇవ్వలేదు. అయితే ఈ ఏడాది రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో మాత్రం ఇద్దరు సామాజిక కార్యకర్తలు చొరవ చూపారు..స్థానిక అధికారుల నుంచి అనుమతితో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
జెండాను ఎగురవేసిన అనంతరం సాజిద్ యూసుఫ్ షా మాట్లాడుతూ.. ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వానికే ఈ క్రెడిట్ దక్కుతుంది. లాల్ చౌక్‌లో జెండాను ఎగురవేసే అవకాశం మాకు లభించింది. ”స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడ పాకిస్థానీ జెండాలు ఎగురవేయడం మాత్రమే చూశాం.. లోయలో శాంతికి విఘాతం కలిగించాలని పాకిస్థానీ ప్రాయోజిత శక్తులు కోరుకుంటున్నాయి. ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుండి, మనం క్షేత్రస్థాయిలో చాలా మార్పులను చూడవచ్చు. నయా కాశ్మీర్ అంటే ఏమిటి అని ప్రజలు అడిగారు. ఈరోజు క్లాక్ టవర్ పైన జాతీయ జెండాను ఎగురవేయడం అంటే నయా కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ ప్రజలు కోరుకునేది ఇదే. మాకు పాకిస్థాన్ జెండాలు అక్కర్లేదు, శాంతి, అభివృద్ధి కావాలి. మొదటిసారిగా మేము భారతదేశంలో ఉన్నామనే భావన కలుగుతోంది అని ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, దేశంలో జాతీయ జెండా లేని ప్రదేశం ఇదే. మేము దీనిని మార్చాలని అని నిర్ణయించుకున్నాము..ఇప్పడు దీన్ని చేసాము. ఇంతకుముందు ఇక్కడ జాతీయ జెండా ఎగురవేయాలని చాలా మంది ప్రయత్నించారు.. అయితే మేము మాత్రమే విజయం సాధించాము. భారతీయుడిగా మేము ఇక్కడ జెండాను ఆవిష్కరించాము మరియు ఇది మాకు ఆనందాన్ని ఇచ్చిందని సాజిద్ యూసుఫ్ అన్నారు.
సాహిల్ బషీర్ భట్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ దొంగలు గతంలో ఇక్కడ వారి పతాకాన్ని ఆవిష్కరించేవారు. ఆ చరిత్రను తిరగరాస్తున్నాం అంటూ గర్వంతో వ్యాఖ్యానించారు. వందలాది పోలీసులు, పారామిలటరీ సిబ్బంది భద్రత మధ్య ఈ కార్యక్రమం జరిగింది. జమ్మూ కాశ్మీర్ రాజకీయాలకు సంబంధించి లాల్ చౌక్‌లోని క్లాక్ టవర్‌కు ఎప్పుడూ చాలా ప్రాముఖ్యత ఉంది. దేశంలోని మరియు జమ్మూ కాశ్మీర్‌లోని పెద్ద నాయకులందరూ క్లాక్ టవర్ పైన జాతీయ జెండాను ఎగురవేయడానికి గతంలో ప్రయత్నించారు, కానీ ఎప్పుడూ విజయవంతం కాలేదు.
Also Read: Horoscope Today: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. నేడు ఏ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..