US Bans Importing Dogs: విదేశీ కుక్కలపై నిషేధం విధించిన అమెరికా.. జూలై 14 నుంచి అమల్లోకి కొత్త చట్టం.. కారణం అదేనా..!

అగ్రరాజ్యం అమెరికాలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాల చెందిన కుక్క పిల్లల దిగుమతిపై నిషేధం విధించింది.

US Bans Importing Dogs: విదేశీ కుక్కలపై నిషేధం విధించిన అమెరికా.. జూలై 14 నుంచి అమల్లోకి కొత్త చట్టం.. కారణం అదేనా..!
Us Bans Importing Dogs From 113 Countries
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 15, 2021 | 7:59 PM

US Bans Importing Dogs From 113 Countries: అగ్రరాజ్యం అమెరికాలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాల చెందిన కుక్క పిల్లల దిగుమతిపై నిషేధం విధించింది. మోసపూరిత రాబిస్ టీకా సర్టిఫికెట్లతో దేశంలోకి దిగుమతి చేసుకున్న కుక్కపిల్లల సంఖ్య గణనీయంగా పెరిగడంతో.. 113 దేశాల నుండి కుక్కల దిగుమతిని నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రేబిస్ సమస్య ఉన్న దేశాల నుంచి కుక్కలను అమెరికాకు తీసుకురాకూడదని ఆ దేశ ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. దాదాపు 113 దేశాలపై ఏడాది పాటు నిషేధం విధించినట్లు తెలిపింది. అయితే, ఇప్పటికే వచ్చిన కుక్కలకు రేబిస్ వ్యాక్సినేషన్ జరిగినట్లు తగిన రుజువులు చూపాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. పూర్తిగా వ్యాక్సినేషన్ చేయడానికి తగినంత వయసుగలవి కాకపోవడంతో విదేశాల నుంచి వస్తున్న కుక్కల ప్రవేశంపై నిషేధం విధించినట్లు తెలిపింది. జూలై 14 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని తెలిపింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఈ ప్రకటనను జారీ చేసింది.

“మేము యునైటెడ్ స్టేట్స్ లోకి దిగుమతి చేసుకున్న కుక్కల ఆరోగ్యంతో పాటు భద్రతను కాపాడటానికి, అలాగే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి మేము ఇలా చేస్తున్నాము” అని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డాక్టర్ ఎమిలీ పియరాసి చెప్పారు. కుక్కల దిగుమతులు పెరుగుదలతో పాటు, తప్పుడు, మోసపూరిత రాబిస్ సర్టిఫికెట్లతో దేశంలోకి ప్రవేశించే కుక్కల పెరిగాయని పియరాచీ చెప్పారు. 2020 లో 450 కు పైగా కుక్కలను తప్పుడు సర్టిఫికెట్లు కలిగి ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇది గత రెండేళ్ళతో పోలిస్తే 52% పెరిగిందని ఆమె తెలిపారు. కుక్క వయసు నాలుగు నెలల కన్నా ఎక్కువ ఉన్నట్లు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పిస్తున్నారని, అటువంటి కుక్కలను అమెరికాలో ప్రవేశించడానికి అనుమతించడం లేదని డాక్టర్ ఎమిలీ పియరాసి తెలిపారు.

అమెరికాకు ఏటా సుమారు 10 లక్షల కుక్కలను రవాణా చేస్తూ ఉంటారని సీడీసీ అధికారులు తెలిపారు. వీటిలో దాదాపు 7.5 శాతం కుక్కలపై ఈ నిషేధం ప్రభావం పడుతుందన్నారు. కొన్ని పరిస్థితుల్లో ఈ ఆంక్షలను సడలిస్తామన్నారు. అంధులకు దారి చూపే గైడ్ కుక్కలు, అమెరికాకు తమ కుక్కలతోపాటు మారుతున్న విదేశీయులకు మినహాయింపు ఇస్తామన్నారు. ఇటీవల తిరస్కరణకు గురైనవాటిలో అత్యధిక కుక్కలు రష్యా, ఉక్రెయిన్, కొలంబియా నుంచి వచ్చినవేనని పేర్కొన్నారు. రేబిస్ రిస్క్ ఎక్కువగా ఉన్న దేశాల నుంచి కుక్కలను తీసుకురావడానికి నిషేధం విధించినట్లు సీడీసీ అధికారులు వివరించారు.

విదేశీ కుక్కలపై నిషేధం విధించడాన్ని అమెరికన్ వెటరినరీ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డగ్లస్ క్రాట్ స్వాగతించారు. దేశంలోకి ఆరోగ్యవంతమైన కుక్కలే వచ్చేలా చూడాలన్నారు.

Read Also… Karate Player Selling Tea: వయసు పాతికేళ్లు.. సాధించిన మెడల్స్ 60.. కుటుంబ పోషణకు చాయ్‌వాలాగా మారిన ప్రపంచ కరాటే ఛాంపియన్‌!