Telugu in America: అమెరికాలో తెలుగు వెలుగులు.. అతివేగంగా వృద్ధి చెందుతున్న భాషల్లో తెలుగుకు పెద్ద పీట!

Telugu in America: అమెరికాలో తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇక్కడ వేగంగా వుద్ది చెండుతున్న భాషల్లో అగ్రస్థానంలో తెలుగు ఉంది.

Telugu in America: అమెరికాలో తెలుగు వెలుగులు.. అతివేగంగా వృద్ధి చెందుతున్న భాషల్లో తెలుగుకు పెద్ద పీట!
Telugu In America
Follow us

|

Updated on: Jun 15, 2021 | 6:29 PM

Telugu in America: అమెరికాలో తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇక్కడ వేగంగా వుద్ది చెండుతున్న భాషల్లో అగ్రస్థానంలో తెలుగు ఉంది. అమెరికా థింక్ టాంక్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, సెంటర్ ఆఫ్ ఇమిగ్రేషన్ సంయుక్తంగా జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అక్కడ తెలుగు మాట్లాడే వారి సంఖ్య గత ఏడేళ్లలో 86 శాతం పెరిగింది. అమెరికాలో ఇంగ్లీష్ కాకుండా ఎక్కువగా మాట్లాడే టాప్ 20 భాషల్లో తెలుగు ముందు వరుసలో ఉంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో 8 కోట్ల 40 లక్షల మంది తెలుగు మాట్లాడుతారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో అత్యధికులు మాట్లాడే నాలుగో భాష తెలుగు. ఇదే విధంగా అమెరికాలోనూ ఇంగ్లీష్ కాకుండా ఇతర భాషలు మాట్లాడేవారిలో తెలుగు మాట్లాడేవారు 4 లక్షల మంది ఉన్నట్టు గుర్తించారు. ఇంట్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ కాకుండా ఎంత మంది ఏయే భాషలు మాట్లాడుతున్నారు అనే విషయంపై అమెరికాలో అధ్యయనం చేశారు. 2010 లో తెలుగు మాట్లాడే వారితో పోలిస్తే ప్రస్తుతం రెట్టింపు సంఖ్యలో తెలుగు మాట్లాడేవారు ఉన్నారని తేల్చిన అధ్యయనం. ఇంకో విశేషం ఏమిటంటే అమెరికాలో అత్యంత వేగంగా పెరుగుతున్న టాప్ 10 భాషల్లో ఏడు భాషలు దక్షిణ ఆసియా ప్రాంతానివే.

అమెరికాలో హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు భారీ డిమాండ్ ఉంది. అమెరికాలో ఉన్న వారిలో చాలా మంది హైదరాబాద్ నుంచి వచ్చినవారే కావడం విశేషం. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఇప్పుడు 800కు పైగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అమెరికాకు వస్తున్న తెలుగు ఐటీ నిపుణుల సంఖ్య భారీగా ఉంటోంది. టెక్నాలజీ, ఇంజనీరింగ్ పరిశ్రమకు హైదరాబాద్ భారతదేశంలోనే ఒక మేజర్ హబ్‌. తెలుగు మాట్లాడే అమెరికన్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ఐటీ నిపుణులను తమ సంస్థల్లో నియమించుకుంటున్నారు. భారతీయులు హెచ్-1బి వీసా స్కీమ్‌ ద్వారా ప్రయోజనం దక్కుతోంది. ఏటా టెక్నాలజీ రంగం వైపు వచ్చే కొన్ని వేల మంది విదేశీయులు వర్క్ వీసాల పైనే వస్తారు. వీటిలో 70 శాతం భారతీయులకే దక్కుతున్నాయి. ఈ వీసా పొందినవారు అమెరికాలో శాశ్వత నివాస హోదాకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుంటుంది.

తెలుగు అంత ఎందుకు వ్యాప్తి చెందుతోంది..

తెలుగు సినిమా, ఇంటర్నెట్‌తో పాటు అమెరికాలోని తెలుగు సంఘాలు భాషా వ్యాప్తికి కృషి చేస్తున్నాయి. తెలుగు సంఘాలు మొదలుపెట్టిన ‘మన బడి’, ‘పాఠశాల’ లాంటి కార్యక్రమాలు తెలుగు భాషను అక్కడ వేగంగా వ్యాప్తి చెందేలా చేస్తున్నాయి. కొన్ని దేవాలయాల్లో తెలుగు నేర్పుతున్నారు. అమెరికన్ కుర్రాళ్లు తెలుగు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలుగువాళ్లు స్థానిక రాజకీయాల్లోకి అడుగులు వేస్తున్నారు. ‘తానా’, ఆటాలాంటి సంస్థలు తెలుగు భాష వ్యాప్తికి తమవంతు కృషి చేస్తూ వస్తున్నాయి.

సెంటర్ ఆఫ్ ఇమిగ్రేషన్ లెక్కల ప్రకారం 2010-2017 మధ్య అమెరికాలో పుంజుకున్న కొత్త భాషల్లో స్పానిష్, చైనీస్, అరబిక్, హిందీ ఉన్నాయి. అమెరికాలోని దాదాపు 32 కోట్ల మొత్తం జనాభా ఉన్నారు. ఇంగ్లిష్ కాకుండా వేరే భాషలు మాట్లాడేవారు 60 శాతానికి పైనే ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది మాట్లాడే భాష స్పానిష్. మిగతా వారిలో చాలా మంది దక్షిణాసియా భాషలు మాట్లాడుతున్నారు. వీటిలో హిందీ మొదటి స్థానం, తర్వాత గుజరాతీ, తెలుగు ఉన్నాయి. అమెరికాలో ఇళ్లలో ఫ్రెంచ్, జర్మన్ భాషలు మాట్లాడేవారి సంఖ్య బాగా తగ్గింది. గత దశాబ్దంగా ఇటాలియన్ భాష మాట్లాడేవారి సంఖ్య 2 లక్షలకు పైగా తగ్గింది. దాదాపు 80 శాతం మంది తెలుగు మాట్లాడేవారు, ఇంగ్లిష్ కూడా బాగా మాట్లాడగలమని ఈ అధ్యయనంలో చెప్పారు.

తెలుగు గురించి కొన్ని విశేషాలు..

  • తెలుగులో మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శతాబ్దానికి చెందినది
  • శాసనాలలో మనకు లభించిన తొలి తెలుగు పదం ‘నాగబు’.
  • హైదరాబాద్ రాజ్యంలో తెలుగు, భాషాభివృద్ధికి కొమర్రాజు వెంకట లక్ష్మణరావు కృషి
  • తెలుగులో వ్యావహారిక భాషోద్యమానికి ఆద్యులు గిడుగు రామ్మూర్తి. ‘తెలుగు’ అనే మాసపత్రిక నిర్వహణ
  • తెలుగులో యాత్రా సాహిత్యానికి ఆద్యులు ఏనుగుల వీరాస్వామయ్య
  • వేమన పద్యాలను సేకరించి, ప్రచురించి, ఆంగ్లంలో అనువదించిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. తొలి తెలుగు శబ్దకోశాన్ని పరిష్కరించి ప్రచురించారు ఆయన. పదవీ విరమణ తరువాత 1854లో లండన్‌లో స్థిరపడి, 1865లో లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసరుగా సేవలు అందిచారు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్.
  • మొట్టమొదటి బైబిల్ ప్రతిని 1812లో ప్రచురించారు. రెవరెండ్ బెంజిమన్ స్కల్జ్ బైబిల్‌ను తెలుగులోనికి అనువాదం చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌లో 1966లో అధికార భాషా చట్టం. ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం మొదటి అధ్యక్షులుగా వావిలాల గోపాలకృష్ణయ్య (1974-77) సేవలు అందించారు.
  • ముగ్గురు తెలుగు రచయితలు జ్ఞానపీఠ్ పురస్కారం వచ్చింది. 1970లో విశ్వనాథ సత్యనారాయణ, 1988లో డా.సి.నారాయణరెడ్డి, 2012లో రావూరి భరద్వాజ ఈ పురస్కారాన్ని పొందారు.
  • 1975లో మొట్టమొదటి తెలుగు మహాసభలు హైదరాబాద్‌లో జరిగాయి. రెండో తెలుగు మహాసభలు 1981 మలేసియాలోని కౌలాలంపూర్‌లో నిర్వహించారు. మూడో మహాసభలను1990 మారిషస్‌లో ఏర్పాటు చేశారు.
  • 2012లో నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో జరిగాయి. ఐదో ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.
  • నిజామాబాద్‌ అసిస్టెంట్‌ సెషన్స్‌ జడ్జి మంగారి రాజేందర్‌ (జింబో) తెలుగు భాషలో తీర్పు వెలువరించిన తొలి న్యాయమూర్తి. ఫిబ్రవరి 19, 2002న తెలుగులో తీర్పు వెలువరించిన తొలి న్యాయమూర్తిగా ఘనత సాధించారు.
  • అక్టోబర్, 1991లో యూనికోడ్ కన్సార్టియం మొదటి వెర్షన్‌లో తెలుగు లిపికి యూనికోడ్ స్టాండర్డ్ వచ్చింది. తానా ఆధ్వర్యంలో ఆన్ లైన్ డిక్షనరీ ‘ఆంధ్రభారతి తెలుగు నిఘంటు శోధన’ తెలుగు వికీపీడియా 10 డిసెంబర్, 2003లో ప్రారంభం అయ్యాయి. బోస్టన్ నగరంలో సమాచార సాంకేతిక నిపుణుడిగా పనిచేస్తున్న వెన్న నాగార్జున తెలుగు వికీపీడియాకు శ్రీకారం చుట్టారు. తెలుగు వికీపీడియా మొదటి లోగోను రూపొందించింది కూడా ఆయనే.
  • అమెరికాలో ఎక్కువమంది మాట్లాడే మాతృభాషల్లో మూడోది తెలుగు భాష. అక్కడ భారతదేశానికి చెందిన భాషల్లో ఎక్కువగా హిందీ మాట్లాడేవారు ఉండగా, రెండో స్థానంలో గుజరాతీ, తెలుగు మూడో స్థానంలో ఉన్నాయి.
  • అమెరికాలో నివసిస్తున్నవారిలో ఇంటివద్ద సుమారు 3,65,566 మంది తెలుగులోనే మాట్లాడుతారని సర్వే తేల్చింది.

Also Read: Betel Leaves Benfits : తమలపాకు ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..! వివిధ ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారం..

Paytm: శ‌ర‌వేగంగా కొన‌సాగుతోన్న వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌.. ఇక‌పై పేటీఎమ్ ద్వారా కూడా రిజిస్ట్రేష‌న్‌.. ఎలా అంటే..

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??