Paytm: శరవేగంగా కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ ప్రక్రియ.. ఇకపై పేటీఎమ్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్.. ఎలా అంటే..
Vaccination Paytm: దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. కరోనాను కట్టడి చేసేందుకు ఉన్న ఏకైక అస్త్రం వ్యాక్సినేషన్‌ను జనాలు ఇప్పుడిప్పుడే పెద్ద ఎత్తున వినియోగించుకుంటున్నారు. అయితే...
Vaccination Paytm: దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. కరోనాను కట్టడి చేసేందుకు ఉన్న ఏకైక అస్త్రం వ్యాక్సినేషన్‌ను జనాలు ఇప్పుడిప్పుడే పెద్ద ఎత్తున వినియోగించుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కోవిన్ వంటి కేంద్ర ప్రభువత్వం నిర్వహిస్తున్న యాప్‌లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసే ఉద్దేశంతో కేంద్రం.. థర్డ్ పార్టీ డెవలపర్లకు కూడా వ్యాక్సిన్ స్లాట్‌ల బుకింగ్‌కు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం యాప్‌లో వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్‌ను ప్రారంభించింది. ఈ విషయాన్ని సంస్థ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఇందుకోసం పేటీఎం యాప్‌లో వ్యాక్సిన్ ఫైండర్ సర్వీస్‌కు ఈ ఫీచర్‌ను జోడించనున్నారు. ఈ ఆప్షన్‌ను క్లిక్ చేసి.. కోవిడ్ వ్యాక్సిన్ బుకింగ్ స్లాట్స్ అందుబాటులో ఉన్నాయో లేవో కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే సమీపంలోని వ్యాక్సినేషన్ కేంద్రాల్లో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాల స్లాట్‌లను బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం పిన్ కోడ్, మొబైల్ నెంబర్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయమై పేటీఎం ప్రతినిధి మాట్లాడుతూ.. ‘కరోనా మహమ్మారి బారి నుంచి భారత్‌ను బయటపడేయడానికి మా వంతుగా ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇది జనాలకు సమీప కేంద్రంలో సజావుగా బుక్ చేసుకోవటానికి ఎంతో ఉపయోగపడుతుంది` అంటూ చెప్పుకొచ్చారు.
పేటీఎం చేసిన ట్వీట్..
From instant alerts to now directly booking on your Paytm app – the new & improved Vaccine Slot Finder tool is here.
Give it a go! ? ?
— Paytm ? ? (@Paytm) June 14, 2021
Covid 19 Third Wave: కోవిడ్ థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి..?
Covid Vaccine: నమ్మండి..! వ్యాక్సిన్ వేసుకుంటే మీరు సేఫ్.. తాజా అధ్యయనంలో వెల్లడి