Cult Fit: మీరు కల్ట్ ఫిట్ సభ్యులా..? అయితే మీకు ఉచితంగా కోవిడ్ 19 వ్యాక్సిన్.. నేటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం.
Cult Fit Free Vaccination: ప్రముఖ ఫిట్‌నెస్ సంస్థ కల్ట్‌ఫిట్ తమ సభ్యుల కోసం ఉచింతంగా వ్యాక్సినేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సుమారు రెండు లక్షలకుపైగా ఆఫ్‌లైన్ సభ్యులకు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు...
Cult Fit Free Vaccination: ప్రముఖ ఫిట్‌నెస్ సంస్థ కల్ట్‌ఫిట్ తమ సభ్యుల కోసం ఉచింతంగా వ్యాక్సినేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సుమారు రెండు లక్షలకుపైగా ఆఫ్‌లైన్ సభ్యులకు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు సంస్థ ప్రకటించింది. దేశంలోని 20 పట్టణాల్లో ఉన్న కల్ట్ ఫిల్ట్ సభ్యులకు ఈ వ్యాక్సిన్‌ను అందించనున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నంలో ఈ సదుపాయాన్నిఅందుబాటులోకి తీసుకొచ్చారు.
వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వారి కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి (జూన్ 16) నుంచి ప్రారంభమైంది. జూన్ 24 నుంచి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. వినియోగదారులు మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ విషయమై కల్ట్‌ఫిట్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. సదరు నగరంలో ఒకే వ్యాక్సిన్ అందుబాటులో ఉంటే దాన్నే ఇవ్వనున్నారు. అలా కాకుండా.. రెండు వ్యాక్సిన్‌లు ఉంటే మాత్రం వినియోగదారుడి ఇష్టానికి అనుగుణంగా వ్యాక్సిన్‌ను ఎంచుకునే అవకాశం కల్పించారు. ఇదిలా ఉంటే సభ్యులు తమతో పాటు మరో కుటుంబసభ్యుల కోసం కూడా వ్యాక్సినేషన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు.. అయితే అందుకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. కల్ట్ ఫిట్‌లో తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని గతంలోనే ప్రకటించింది.
కల్ట్ ఫిట్ చేసిన ట్వీట్..
When we say “We Are Cult”, we really mean it! Our cultpass BLACK/GOLD members can now register for FREE vaccines across 20 cities. And you can even register 1 dependent (at cost).
— cult.fit (@cultfitOfficial) June 14, 2021
Beautiful Art: నాణేలతో అద్భుతమైన కళాకృతులు.. మీరు చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు..