వూహాన్ ల్యాబ్ థియరీ వట్టిదే ..! చైనా శాస్త్రజ్ఞురాలి ఖండన…….మేం చేసిన రీసెర్చ్ వేరని స్పష్టీకరణ

ప్రపంచాన్ని అట్టుడికిస్తున్న కోవిద్ వైరస్ తో బాటు గబ్బిలాలపై చైనా లోని వూహాన్ ల్యాబ్ రీసెర్చర్లు జరుపుతున్న పరిశోధనలు, దీనిపై రేగిన వివాదాలు ఇంకా హాట్ హాట్ గానే చర్చనీయాంశమవుతున్నాయి.

వూహాన్ ల్యాబ్  థియరీ వట్టిదే ..! చైనా శాస్త్రజ్ఞురాలి ఖండన.......మేం చేసిన రీసెర్చ్ వేరని స్పష్టీకరణ
Wuhan Lab Theory Condemn Wo
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jun 15, 2021 | 12:15 PM

ప్రపంచాన్ని అట్టుడికిస్తున్న కోవిద్ వైరస్ తో బాటు గబ్బిలాలపై చైనా లోని వూహాన్ ల్యాబ్ రీసెర్చర్లు జరుపుతున్న పరిశోధనలు, దీనిపై రేగిన వివాదాలు ఇంకా హాట్ హాట్ గానే చర్చనీయాంశమవుతున్నాయి. కరోనా వైరస్ తమ ల్యాబ్ నుంచే పుట్టిందన్న లీక్ థియరీని షీ జెంగ్లీ అనే శాస్త్రజ్ఞురాలు తోసిపుచ్చింది. అసలు ఆధారాలు లేనిదాన్ని మీకు ఎలా ఆధారాలుగా చూపుతామని ఆమె ప్రశ్నించింది. దీనిపై ఎందుకింత రచ్చ చేస్తున్నారని కూడా వ్యాఖ్యానించింది. న్యూయార్క్ టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె.. ఈ ల్యాబ్ థియరీమీద ప్రపంచం ఎందుకింత రాధ్దాంతం చేస్తోందని, తమలాంటి అమాయక రీసెర్చర్లపై అదేపనిగా విమర్శలు చేస్తున్నారని ఆరోపించింది. గబ్బిలాలకు సంబంధించి కరోనా వైరస్ లపై తాము పరిశోధనలు చేస్తున్న విషయం నిజమేనని ఆమె అంగీకరించింది. వైరస్ ల సామర్థ్యాన్ని పెంచడానికి తమ ల్యాబ్ లో ప్రత్యేకంగా పరిశోధనలు చేయడం లేదని.. తాము చేస్తున్న రీసెర్చ్.. గబ్బిలాల్లోని వివిధ జాతుల్లో ఈ వైరస్ లు చూపగల ప్రభావాన్ని అంచనా వేయడానికే ఇది ఉద్దేశించినదని ఆమె వివరించింది. అంతే తప్ప మనుషులపై ఈ వైరస్ సామర్థ్యం పెరుగుతుందా అన్న విషయాన్ని తాము పరిశోధించలేదని ఆమె వెల్లడించింది.

ఈ పాండమిక్ పుట్టుక పైన, ల్యాబ్ లీక్ థియరిపైన ఇన్వెస్టిగేట్ చేయాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ గతనెలలో ఆదేశించారు. అంతకు ముందు మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూడా ల్యాబ్ నుంచే ఈ వైరస్ జనించివుండవచ్చునని చాలా సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అయితే 2019 లో యునాన్ ప్రావిన్స్ లోని గబ్బిలాల గుహలో ప్రవేశించిన ముగ్గురు వూహాన్ ల్యాబ్ రీసెర్చర్లు ఆ తరువాత అనారోగ్యం బారిన పడడంతో వూహాన్ ల్యాబ్ థియరీ లీక్ వార్తలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం… 2017 లో షీ జెంగ్లీ, ఆమె సహాయక బృందం ఈ ల్యాబ్ లో కొత్త హైబ్రిడ్ బ్యాట్ వైరస్ ను సృష్టించారని ప్రస్తుతమున్న వైరస్ లను వీటితో మిక్స్ చేయడం ద్వారా కలిగే ఫలితాలను విశ్లేషించారని వెల్లడైంది. కానీ ప్రమాదకరమైన వైరస్ లను సృష్టించాలన్నది తమ అభిమతం కాదని ఈమె అంటోంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Ferran Torres: గర్ట్‌ఫ్రెండ్‌ ఎవరు ఆమె పేరేంటి? అంటూ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోన్న స్పానిష్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు..

Viral‌ Video : గాల్లో వేలాడిన గుర్రం..! మనిషి చేసే తప్పులు జంతువులకు ముప్పుగా పరిణమించాయి.. వైరల్‌ వీడియో..