అంతరిక్షం నుంచి…..చూసినప్పుడు సూయెజ్ కెనాల్….ఇదిగో ! ఇలా !…ఫ్రెంచ్ వ్యోమగామి పంపిన ఇమేజ్ వండర్ !

అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఫ్రెంచ్ వ్యోమగామి ఒకరు పై నుంచి సూయెజ్ కెనాల్ ఇమేజీని ఈ నెల 13 న ట్విటర్ లో షేర్ చేశారు. థామస్ పెస్ క్వెట్ అనే ఈయన ఈ భారీ కాలువ చిత్రాన్ని అయితే తీశాడు గానీ..

అంతరిక్షం నుంచి.....చూసినప్పుడు సూయెజ్ కెనాల్....ఇదిగో ! ఇలా !...ఫ్రెంచ్ వ్యోమగామి పంపిన ఇమేజ్ వండర్ !
Astronaut Shared Suez Canal
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jun 15, 2021 | 12:20 PM

అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఫ్రెంచ్ వ్యోమగామి ఒకరు పై నుంచి సూయెజ్ కెనాల్ ఇమేజీని ఈ నెల 13 న ట్విటర్ లో షేర్ చేశారు. థామస్ పెస్ క్వెట్ అనే ఈయన ఈ భారీ కాలువ చిత్రాన్ని అయితే తీశాడు గానీ.. ఇది 100 ఇమేజీల కలయిక అని పేర్కొన్నాడు. రెండు సమాంతర జల మార్గాలు, అయిదు ఉపనదుల్లాంటి కాలువలతో కూడిన ఈ సూయెజ్ కెనాల్ ఫోటో అద్భుతంగా ఉందని యాజర్లు..నెట్రిజన్లు ప్రశంసించారు. భూమికి 1400 కి.మీ. దూరంలో నుంచి అత్యంత అధునాతన కెమెరాను ఉపయోగించి గత మే 29 న తీసిన ఈ ఇమేజీని ఈ నెల 13 న ఆయన షేర్ చేయడం విశేషం.బ్రహ్మాండమైన..పొడవైన ఈ కాలువను పైనుంచి చూసిన పక్షంలో ఇలా పాయలు..పాయలుగా కనిపిస్తుందని ఆ వ్యోమగామి పేర్కొన్నాడు. ఈ ఇమేజీలను కలిపిన తీరు అద్భుతమని, నిజానికి దీన్ని తీయడానికి ఎంతో సహనం, నైపుణ్యం అవసరమని ఓ యూజర్ ప్రశంసించారు. మీ ఫోటోలను ఎవరు ఎడిట్ చేశారో గానీ.. వారికి హ్యాట్సాఫ్ అని మరొకరు పేర్కొన్నారు. ఆకాశం నుంచి ఈ భూగ్రహాన్ని చూసిన మీరెంతో లక్కీ అని. వీటిని షేర్ చేసినందుకు కృతజ్ఞతలని ఒకరు కొనియాడారు.

థామస్ పెస్ క్వెట్ అంతరిక్ష కేంద్రంలో ఆరు నెలలుగా ఉన్నాడు. ఈ సూయెజ్ కాలువ ఇమేజీలో ‘ఎవర్ గ్రీన్[…కార్గో షిప్ కూడా కనిపిస్తున్నాయి. గత మార్చిలో వారం రోజులపాటు ఈ కాలువను ఈ షిప్ బ్లాక్ చేసేసింది. అది ప్రపంచవ్యాప్త వార్త అయింది కూడా. యూరప్, ఆసియాలను కలిపే ఈ కాలువ అతి సుదీర్ఘమైనది. ప్రకృతి అందాలంటే ఇష్టపడే ఈ ఫ్రెంచ్ వ్యోమగామి దీని ఫోటోలు పంపడం విశేషమే..

మరిన్ని ఇక్కడ చూడండి: వూహాన్ ల్యాబ్ థియరీ వట్టిదే ..! చైనా శాస్త్రజ్ఞురాలి ఖండన…….మేం చేసిన రీసెర్చ్ వేరని స్పష్టీకరణ

Ferran Torres: గర్ట్‌ఫ్రెండ్‌ ఎవరు ఆమె పేరేంటి? అంటూ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోన్న స్పానిష్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు..

సిబిల్ స్కోరా..? చిత్రగుప్తుడి చిట్టానా..? అసలు సిబిల్ ప్రయోజనాలే
సిబిల్ స్కోరా..? చిత్రగుప్తుడి చిట్టానా..? అసలు సిబిల్ ప్రయోజనాలే
అర్ధరాత్రి బైక్ దొంగతనానికి వచ్చారు.. కట్ చేస్తే..
అర్ధరాత్రి బైక్ దొంగతనానికి వచ్చారు.. కట్ చేస్తే..
టాయిలెట్‌ డోర్ ఓపెన్ చేయగానే ఊహించని సీన్.. కనిపించింది చూడగా
టాయిలెట్‌ డోర్ ఓపెన్ చేయగానే ఊహించని సీన్.. కనిపించింది చూడగా
పైకి చూస్తే లారీ అంతా పేపర్ బండిల్సే.. కానీ లోపల చెక్ చేయగా
పైకి చూస్తే లారీ అంతా పేపర్ బండిల్సే.. కానీ లోపల చెక్ చేయగా
ఈ కొండముచ్చు యమ డేంజర్‌.! ఏకంగా ఓ ఊరినే భయపెడుతున్న కొండముచ్చు..
ఈ కొండముచ్చు యమ డేంజర్‌.! ఏకంగా ఓ ఊరినే భయపెడుతున్న కొండముచ్చు..
మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్‌ ప్రమాణ స్వీకారం.. మోదీ, చంద్రబాబు సహా
మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్‌ ప్రమాణ స్వీకారం.. మోదీ, చంద్రబాబు సహా
ఇదేందయ్యా ఇది! లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. రిస్క్‌లో పడ్డ 20 మంది!
ఇదేందయ్యా ఇది! లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. రిస్క్‌లో పడ్డ 20 మంది!
90 లక్షల ఇళ్లు ఖాళీ ఏమయ్యారు.? ఎటు పోయారు.? అసలేం జరిగింది.!
90 లక్షల ఇళ్లు ఖాళీ ఏమయ్యారు.? ఎటు పోయారు.? అసలేం జరిగింది.!
ఏపీలో కొత్త రేషన్ కార్డ్ కావాలా.? దరఖాస్తుల స్వీకరణ మొదలు..
ఏపీలో కొత్త రేషన్ కార్డ్ కావాలా.? దరఖాస్తుల స్వీకరణ మొదలు..
మా ఊరికి పులి వచ్చింది.. మీ ఊరుకొచ్చిందా.? అదే పులి పలు చోట్ల..
మా ఊరికి పులి వచ్చింది.. మీ ఊరుకొచ్చిందా.? అదే పులి పలు చోట్ల..