Delta Variant: డెల్టా వేరియంట్ ఎఫెక్ట్……ఆ నగరంలో మరో నెల పాటు ఆంక్షల పొడిగింపు….ప్రధాని బోరిస్ జాన్సన్

బ్రిటన్ లో డెల్టా వేరియంట్ మళ్ళీ విజృంభిస్తోంది. ముఖ్యంగా ఇంగ్లండ్ లో కోవిద్ ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయి.

Delta Variant: డెల్టా వేరియంట్ ఎఫెక్ట్......ఆ నగరంలో  మరో నెల పాటు ఆంక్షల పొడిగింపు....ప్రధాని బోరిస్ జాన్సన్
Boris Johnson
Follow us

| Edited By: Phani CH

Updated on: Jun 15, 2021 | 10:45 AM

బ్రిటన్ లో డెల్టా వేరియంట్ మళ్ళీ విజృంభిస్తోంది. ముఖ్యంగా ఇంగ్లండ్ లో కోవిద్ ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయి. ఈ కారణంగా ఈ నగరంలో ఆంక్షలను మరో నాలుగు వారాల పాటు పొడిగిస్తున్నట్టు ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. నిజానికి వచ్చే నెల 19 నుంచి దేశవ్యాప్తంగా ఆంక్షలను ఎత్తివేయాలన్నది ప్రభుత్వ ఆలోచన.. ఇప్పటికే గత మార్చి నుంచే ప్రజలు మాస్కుల జోలికి పోవడంలేదు. ఇక భౌతిక దూరం పాటింపు వంటివాటికి స్వస్తి చెప్పారు. కానీ ఈ కొత్త డెల్టా స్ట్రెయిన్ కారణంగా ఇంగ్లండ్…స్కాట్లాండ్, న్యూ సౌత్ వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ వంటి చోట్ల కోవిద్ కేసులు పెరుగుతున్నాయి. ఆల్ఫా వేరియంట్ కన్నా ఈ వేరియంట్ 60 శాతం ఎక్కువగా ప్రమాదకరమైనదని నిపుణులు అంటున్నారు. మొత్తానికి ఈ చోట్ల జులై 19 వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి.వచ్చేవారం నుంచి ఇతర నగరాల్లో పబ్ లను, నైట్ క్లబ్బులను కూడా అనుమతించనున్నారు. ఆంక్షల ఎత్తివేతలో నెల రోజులు జాప్యం చేసినందువల్ల అమ్మకాల్లో సుమారు 4.23 బిలియన్ డాలర్ల మేర నష్టం వస్తుందని ట్రేడ్ అసోసియేషన్ ఆఫ్ యూకే హాస్పిటాలిటీ అంచనా వేస్తోంది.

గత ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు సుమారు రోజుకు 8 వేల కోవిద్ కేసులు నమోదవుతున్నాయి. గతవారం పాజిటివ్ కేసులు ఒక్కసారిగా 50 శాతం పెరిగాయి. ఈ కారణంగా మొదట ఇంగ్లాండ్ లో ఆంక్షలను పొడిగించాలని బోరిస్ ప్రభుత్వం భావిస్తోంది. నాలుగు రకాల వేరియంట్లలో డెల్టా వేరియంట్ ను అదుపు చేయడానికి ఎక్కువ కాలం పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Rare Fish: సూర్యాపేట జిల్లాలో అరుదైన ఎర్ర చందనం మరియు బంగారు తీగ చేపలు వీడియో…

Covid Sensor: వాసన ద్వారా కోవిడ్‌ సోకిన వారిని గుర్తించే సరికొత్త కోవిడ్‌ సెన్సార్‌.. ( వీడియో )