US Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. నలుగురు మృతి.. కారులో ప్రయాణిస్తూ..

డేటన్లోని బట్లర్‌ టౌన్‌షిప్‌ అనే పట్టణంలో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతిచెందినట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు.

US Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. నలుగురు మృతి.. కారులో ప్రయాణిస్తూ..
Us Shooting
Follow us

|

Updated on: Aug 07, 2022 | 12:04 PM

US Shooting: అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ పెచ్చుమీరుతోంది. వరుస కాల్పుల ఘటనలతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా.. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించారు. ఈ ఘటన అమెరికాలోని ఒహైయో రాష్ట్రం డేటన్‌ సమీపాన చోటుచేసుకుంది. డేటన్లోని బట్లర్‌ టౌన్‌షిప్‌ అనే పట్టణంలో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతిచెందినట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు. దుండగుడు కారులో సంచరిస్తూ.. శుక్రవారం మధ్యాహ్నం నుంచి వివిధ ప్రాంతాల్లో కాల్పులకు తెగబడినట్లు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసు బృందాలు దుండగుడి కోసం గాలిస్తున్నాయి. నిందితుడిని 39 ఏళ్ల స్టీఫెన్‌ మార్లోగా అనుమానిస్తున్నారు. దుండగుడు మారణాయుధాలతో సంచరిస్తున్నాడని ఎక్కడైనా కనిపిస్తే.. దగ్గరకు వెళ్లొద్దంటూ పోలీసులు సూచించారు. వెంటనే ఎఫ్‌బీఐకి సమాచారం ఇవ్వాలని అధికారులు తెలిపారు. ఈమేరకు అతని ఫొటో, ప్రయాణిస్తున్న కారుకు సంబంధించిన ఫొటోను పోలీసులు విడుదల చేశారు.

దుండగుడు ఎందుకు కాల్పులు జరిపాడో తెలియదని.. పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు మార్లోకి ఇండియానా పోలీస్‌, షికాగో, లెక్సింగ్టన్‌, కెంటకీ నగరాలతో కూడా సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ నగరాల్లో ఎక్కడో ఒక చోట.. నిందితుడు ఉంటాడని జల్లెడ పడుతున్నారు. మార్లో ఇప్పటికే పలు కేసుల్లో శిక్ష అనుభవించి విడుదలైనట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్