US Shooting: యుఎస్ లో మళ్ళీ పేలిన తుపాకీ .. గే నైట్‌క్లబ్‌లో కాల్పులు.. 5 మంది మృతి, 18 మందికి గాయాలు

ప్రతి సంవత్సరం, 20 నవంబర్ ప్రపంచవ్యాప్తంగా లింగమార్పిడి జ్ఞాపకార్థ దినోత్సవం లేదా అంతర్జాతీయ లింగమార్పిడి దినోత్సవం జరుపుకుంటారు. ఇలా ట్రాన్స్‌జెండర్స్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ను  1999 నుంచి జరుపుకోవడం ప్రారంభించారు.

US Shooting: యుఎస్ లో మళ్ళీ పేలిన తుపాకీ .. గే నైట్‌క్లబ్‌లో కాల్పులు.. 5 మంది మృతి, 18 మందికి గాయాలు
Colorado Springs Gay Night Club
Follow us
Surya Kala

|

Updated on: Nov 20, 2022 | 5:33 PM

అమెరికాలో మళ్ళీ కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఏడాది అమెరికాలోని వివిధ నగరాల్లో కాల్పుల ఘటనలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు తాజా మరో కాల్పుల కేసు వెలుగులోకి వచ్చింది.  కొలరాడో స్ప్రింగ్స్ లో  ఆదివారం గే నైట్‌క్లబ్‌లో ఓ సాయుధుడు కాల్పులు జరిపాడు. కొలరాడో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, 18 మంది గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో క్లబ్ బయట వీధుల్లో భారీ సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించినట్లు కనిపిస్తుంది.

ఈ కాల్పుల ఘటన ‘ట్రాన్స్‌జెండర్స్ డే ఆఫ్ రిమెంబరెన్స్’ లేదా TDOR రోజున జరిగింది. ప్రతి సంవత్సరం, 20 నవంబర్ ప్రపంచవ్యాప్తంగా లింగమార్పిడి జ్ఞాపకార్థ దినోత్సవం లేదా అంతర్జాతీయ లింగమార్పిడి దినోత్సవం జరుపుకుంటారు. ఇలా ట్రాన్స్‌జెండర్స్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ను  1999 నుంచి జరుపుకోవడం ప్రారంభించారు. ఈ వేడుకలు జరుగుతుండగా.. ఓ  సాయుధుడు స్నిపర్ రైఫిల్‌ని ఉపయోగించి కనీసం 10 మందిపై కాల్పులు జరిపాడని US మీడియా నివేదికలు తెలిపాయి. అయితే సాయుధుడు ఎందుకు కాల్పులు జరిపాడనే విషయంపై ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. అసలు నిందితుడు ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ ప్రజలను ఎందుకు టార్గెట్ చేశాడనేది తెలియాల్సి ఉందన్నారు.

అయితే 2016 లో కూడా ఇటువంటి దారుణ ఘటన జరిగింది. ఫ్లోరిడాలోని గే నైట్‌క్లబ్‌పై సాయుధుడు చొరబడి కనీసం 50 మందిని కాల్చి చంపాడు. మరో 53 మంది గాయపడ్డారు. ఈ నైట్‌క్లబ్‌లో కాల్పులు జరిపిన వ్యక్తి ఒంటరి దాడికి పాల్పడ్డాడు, అతన్ని 29 ఏళ్ల ఉమర్ మతీన్‌గా గుర్తించారు.

ఇవి కూడా చదవండి

అమెరికాలో పెరుగుతున్న కాల్పుల ఘటనలు: ఈ సంవత్సరం ప్రారంభంలో, ఓస్లో నగరంలోని స్వలింగ సంపర్కుల నైట్‌క్లబ్‌లో కాల్పుల సంఘటన జరిగింది. ఇందులో ఇద్దరు వ్యక్తులు మరణించారు మరియు 20 మంది గాయపడ్డారు. ఈ ఏడాది అమెరికాలో  ఎక్కడోచోట కాల్పుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ వివిధ నగరాల్లో కాల్పుల ఘటనలు నమోదవుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఇలాంటి ఘటనల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..