Pakistani Actress: రణవీర్ తో ఉన్న ఫోటోని షేర్ చేసిన పాకిస్థాన్ నటి.. భారతీయుల దగ్గర డబ్బుంది కనుక ఈ ఫోటో అంటూ నెటిజన్లు ట్రోల్
రణవీర్ సింగ్‌తో చిత్రాన్ని పంచుకున్న తర్వాత.. భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. సజల్ అలీని పలువురు ట్రోల్స్ చేస్తున్నారు. ఒకరు సజల్ ఎప్పుడూ ఇలా పాకిస్తానీలతో ఇలా కలిసి ఉన్న సందర్భం లేదు.. ఇక్కడవారి మీద కూడా దృష్టి పెట్టండి
పాకిస్థానీ స్టార్ హీరోయిన్ సజల్ అలీ బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశాడు రణవీర్ సింగ్ . ప్రస్తుతం ఈ చిత్రంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఫిలింఫేర్ మిడిల్ ఈస్ట్ అచీవర్స్ నైట్ అవార్డ్స్ వేడుక సందర్భంగా తీసిన చిత్రం. ఈ అవార్డు వేడుకలో, రణవీర్ సింగ్‌కు సూపర్ స్టార్ ఆఫ్ ది డికేడ్ అవార్డు లభించింది.
సజల్‌తో సెల్ఫీ దిగిన రణవీర్ సింగ్ రణవీర్ సింగ్ తో ఉన్న తన ఫోటోని సోషల్ మీడియాలో సజల్ అలీ షేర్ చేసింది. ఈ ఫోటోని రణవీర్ సింగ్ క్లిక్ చేశాడు. ఈ సెల్ఫీని షేర్ చేసిన ఫొటోలో రణవీర్, సజల్ అలీ పింక్ డ్రెస్‌లో కనిపిస్తున్నారు. పెద్ద చెవిపోగులతో మోడ్రన్ లుక్ లో అందంగా కనువిందు చేస్తోంది. ఈ ఫొటోలో సజల్ రణవీర్ తో పాటు.. సజల్ సోదరుడు ముహమ్మద్ అలీ కూడా ఉన్నాడు.
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి:
View this post on Instagram
చిత్రంపై ట్రోల్స్: రణవీర్ సింగ్‌తో చిత్రాన్ని పంచుకున్న తర్వాత.. భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. సజల్ అలీని పలువురు ట్రోల్స్ చేస్తున్నారు. ఒకరు సజల్ ఎప్పుడూ ఇలా పాకిస్తానీలతో ఇలా కలిసి ఉన్న సందర్భం లేదు.. ఇక్కడవారి మీద కూడా దృష్టి పెట్టండి అని కామెంట్ చేయగా.. మరొకరు.. ఈ ఫోటో భారతీయులను ఆకట్టుకోవడానికి ఎందుకంటే వారి దగ్గర బాగా డబ్బు ఉంది.. డబ్బులుంటే ఏమైనా చేయవచ్చు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా ఈ ఫోటో పలువురు పాకిస్తానీ ప్రజల నుంచి విమర్శలను ఎదుర్కొంటుంది.
చాలా మంది ప్రశంసిస్తున్నారు అదే సమయంలో సజల్ పై చాలా మంది ఆమెను ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చంద్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాదారుడు.. “మీ కంటే ఎవరూ పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించలేరని పేర్కొనగా.. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది సజల్” అని రాశారు.
పాకిస్థాన్ లో స్టార్ హీరోయిన్ సజల్ అలీ సజల్ అలీ పాకిస్థానీ వినోద పరిశ్రమలో స్టార్ హీరోయిన్. పలు పాపులర్ పాకిస్తానీ టీవీ సీరియల్స్, సినిమాలో నటిస్తూ అనేక సూపర్ హిట్స్ అనుకుంది. అటు బుల్లి తెరపై, ఇటు వెండి తెరపై ఆధిపత్యం చెలాయిస్తుంది. అయితే సజల్ బాలీవుడ్ లో కూడా నటించింది. అతిలోక సుందరి శ్రీదేవి నటించిన మామ్ చిత్రంతో సజల్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. సినిమాలో సజల్ నటనకు ప్రశంసలు అందుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సజల్ అలీకి 92 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..