Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వాడే పెన్నుపై వివాదం

బ్రిటన్ ప్రధానమంత్రిగా రిషి సునాక్ బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పడు తాజాగా మరో వివాదంలో ఆయన ఇరుక్కున్నారు. అదేంటంటే ఆయన వాడుతున్న పెన్నుపై నిపుణులు ఆందోళన చెందుతున్నారు. పెన్ను వాడటంపై ఆందోళన ఎందుకున్న ఆశ్చర్యం కలుగుతోంది కదా. అయితే అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వాడే పెన్నుపై వివాదం
Rishi Sunak
Follow us
Aravind B

| Edited By: Ravi Kiran

Updated on: Jun 29, 2023 | 7:03 AM

బ్రిటన్ ప్రధానమంత్రిగా రిషి సునాక్ బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పడు తాజాగా మరో వివాదంలో ఆయన ఇరుక్కున్నారు. అదేంటంటే ఆయన వాడుతున్న పెన్నుపై నిపుణులు ఆందోళన చెందుతున్నారు. పెన్ను వాడటంపై ఆందోళన ఎందుకున్న ఆశ్చర్యం కలుగుతోంది కదా. అయితే అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్తే రిషి సునాక్ గతంలో ఛాన్స్‌లర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆయన డిస్పోసబుల్ ‘పైలట్ వి’ పెన్నులను వాడుతున్నారు. అయితే ఇటీవల ప్రధాని అయిన తర్వాత కూడా ఆయన అదే పెన్నును అధికారిక కార్యక్రమాల్లోను వినియోగిస్తున్నారు. 15 రోజుల క్రితం కేబినేట్ సమావేశంలో ఆయన చేతిలో ఈ పెన్ను కనిపించింది. అలాగే పలు అధికారిక పత్రాలపై కూడా ఇదే పెన్నుతో సంతకాలు చేశారు. అయితే పైలట్ వి పెన్నుతో రాసిన అక్షరాలను చెరిపుకునే అవకాశం ఉంటుంది. దీంతో భద్రతాపరంగా దీని వాడకం సురక్షితం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు . రిషి సునాక్ ఈ పెన్ను వాడటం వల్ల అధికారిక పత్రాల్లో ఆయన రాసిన వాటిని ఎవరైనా తెలియకుండా చెరిపివేసే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ పరంగా చేసే పనులకు లిఖితపూర్వకంగా భద్రపరిచేందుకు ఇచ్చే పత్రాలను ఎరేజబుల్ పెన్నుతో రాయడం వల్ల ఇబ్బందులు కలుగుతాయని చెబుతున్నారు. ఈ పెన్నుల వినియోగించడం వల్ల రాజకీయ నాయకులపై ప్రజల్లో విశ్వాసం తగ్గిపోతుందని చెబుతున్నారు. అయితే ఇందుకు సంబంధించిన విషయంపై విశ్వసనీయ వర్గాలు స్పందించాయి. ప్రధాని అన్ని పత్రాలను భద్రంగా ఉంచుకుంటారని చెప్పాయి. ప్రధాని ఈ పెన్నుతో తాను రాసిన వాటిని చెరిపివేసే పని ఎప్పుడు చేయలేదని.. భవిష్యత్తులో కూడా ఇలా చేయరని సునాక్ మీడియా కార్యదర్శి స్పష్టం చేశారు. అయితే ఈ పెన్ను ధర మార్కెట్లో 4.75 పౌండ్లుగా ఉంది. మన కరెన్సీలో దీని ధర దాదాపు రూ.495

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..