Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హెచ్‌-1బీ వీసాదారులకు కెనడా గుడ్‌న్యూస్‌.. కెనడాలో పనిచేసుకునేందుకు అనుమతి

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న 10 వేల మంది హెచ్-1 బీ వీసాదారులకు ఆ దేశ ఇమ్మిగ్రేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. వీరు కెనడాలో విధులు నిర్వహించుకునేందుకు ఓపెన్ వర్క్ పర్మిట్ చేస్తున్నట్లు ఆ ఇమ్మిగ్రేషన్ మంత్రి సీన్ ఫ్రేజర్ తెలిపారు. అలాగే ఈ ప్రోగ్రాం కింద వారి కుటుంబసభ్యులు చదువుకునేందుకు, పనిచేసేందుకు వీలుగా కూడా అనుమతి కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

హెచ్‌-1బీ వీసాదారులకు కెనడా గుడ్‌న్యూస్‌.. కెనడాలో పనిచేసుకునేందుకు అనుమతి
H1b Visa
Follow us
Aravind B

|

Updated on: Jun 29, 2023 | 4:23 AM

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న 10 వేల మంది హెచ్-1 బీ వీసాదారులకు ఆ దేశ ఇమ్మిగ్రేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. వీరు కెనడాలో విధులు నిర్వహించుకునేందుకు ఓపెన్ వర్క్ పర్మిట్ చేస్తున్నట్లు ఆ ఇమ్మిగ్రేషన్ మంత్రి సీన్ ఫ్రేజర్ తెలిపారు. అలాగే ఈ ప్రోగ్రాం కింద వారి కుటుంబసభ్యులు చదువుకునేందుకు, పనిచేసేందుకు వీలుగా కూడా అనుమతి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఇందకు సంబంధించి కెనడా వలసలు, శరణార్థులుస పౌరసత్వ సేవల శాఖ ప్రకటన విడుదల చేసింది. అయితే హైటెక్ రంగాలకు చెందిన కొన్ని కంపెనీలు అమెరికా, కెనడా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో పనిచేసే చాలామంది ఉద్యోగులు హెచ్-1బీ విసాదారులే. అయితే జులై 16, 2023 నాటికి హెచ్‌-1బీ వీసాలో అమెరికాలో పనిచేస్తున్నవారు, ఈ వీసాదారులతో వచ్చే కుటుంబసభ్యులు కూడా కెనడాకు వచ్చేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

ఈ కొత్త ప్రోగ్రామ్‌ కింద.. ఆమోదం పొందిన హెచ్‌-1బీ వీసాదారులకు మూడేళ్లలో ఓపెన్ వర్క్ పర్మిట్ లభిస్తుంది. వారు కెనడాలో ఎక్కడైనా, ఏ యజమాని వద్దనైనా పనిచేసేందుకు అవకాశం ఉంటుందని కెనడా ఇమ్మిగ్రేషన్‌ విభాగం పేర్కొంది. ఇక వారి భాగస్వాములు, డిపెండెంట్లు కూడా కెనడాలో ఉద్యోగం, చదువుకునేందుకు తాత్కాలిక నివాస వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే ఈ ఏడాది చివరికి ఈ ఇమ్మిగ్రేషన్‌ స్ట్రీమ్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ఇమ్మిగ్రేషన్‌ మంత్రి ఫ్రేజర్‌ తెలిపారు. ఈ స్ట్రీమ్‌ కింద దరఖాస్తు చేసుకునేందుకు ఎవరెవరు అర్హులు అనేది మాత్రం ఆయన స్పష్టంగా చెప్పలేదు.