సముద్రంలో భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు..సుమారు రెండు వేల కిలోల ప్యాకెట్లతో
ఇటలీలోని సిసిలీకి సమీపంలో ఉన్న సముద్ర జలాల్లో భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు లభించాయి. సుమారు రెండు వేల కిలోల బురువున్న 70 బండిళ్లలో 1600 ప్యాకెట్లు కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ ఏకంగా రూ.3,700 కోట్లు.

ఇటలీలోని సిసిలీకి సమీపంలో ఉన్న సముద్ర జలాల్లో భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు లభించాయి. సుమారు రెండు వేల కిలోల బురువున్న 70 బండిళ్లలో 1600 ప్యాకెట్లు కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ ఏకంగా రూ.3,700 కోట్లు. అయితే స్మగ్లర్లు ఈ కొకైన్ ను నౌకలో తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నీటిపై తేలియాడుతున్న వీటి జాడను గుర్తించేందుకు వీలుగా ఆ ప్యాకెట్లకు ట్రాకింగ్ డివైజ్ ను కూడా అమర్చినట్లు తెలిపారు. పోలీసులు హెలికాప్టర్ లో పెట్రోలింగ్ చేస్తుండగా ఇవి కనిపించాయి.
గతంలోను సముద్రంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. 2021లోని యూకే అధికారులు దక్షిణ ఇంగ్లాండ్ తీరంలో సుమారు 2 టన్నుల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో బ్రిటీష్ అధికారులు కూడా 221 మిలియన్ల డాలర్ల విలువైన డ్రగ్స్‌ని కనుగొన్న తర్వాత ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పుడు సిసిలీ సమీపంలోని సముద్రంలో పట్టుబడ్డ వాటిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.




మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..
