AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: టైమ్ ట్రావెల్ అంటే ఇదేనేమో.! అక్కడ న్యూఇయర్‌కు ఇంకా వారం టైమ్ ఉంది.. ఎక్కడంటే.?

టైమ్ ట్రావెల్ అంటే ఇదేనేమో..! ఇంకా అక్కడ కొత్త సంవత్సరం రాలేదు. ఇంకో వారం సమయం ఉంది. మరి ఆ ప్రాంతం ఏంటో మీకు తెలుసా.? ఓ సారి ఆ ప్రాంతం ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఓ సారి మీరూ లుక్కేయండి.

Hyderabad: టైమ్ ట్రావెల్ అంటే ఇదేనేమో.! అక్కడ న్యూఇయర్‌కు ఇంకా వారం టైమ్ ఉంది.. ఎక్కడంటే.?
Newyear12
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Jan 05, 2026 | 12:56 PM

Share

ప్రపంచమంతా 2026 కొత్త ఏడాది వేడుకల్లో ఘనంగా నిర్వహించి ఇప్పుడిప్పుడే ఆ సంబరాల నుంచి బయటికొస్తున్నారు. కానీ ఈ భూమి మీద ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాత్రం న్యూ ఇయర్ 2026 రాలేదు. అంతేనా క్రిస్మస్ కూడా రాలేదు. అవును, మీరు విన్నది నిజమే! మనమంతా జనవరి మొదటివారంలో ఉంటే.. ఆ ప్రాంత ప్రజలు మాత్రం ఇంకా డిసెంబర్ మూడ్ లోనే ఉన్నారు. రేపు అంటే జనవరి 6 వారు క్రిస్మస్ జరుపుకోబోతున్నారు. వినడానికి వింతగా ఉన్నా.. ఇది అక్షరాల నిజం. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

కారణం అదే.. క్యాలెండర్ మాయాజాలం!

సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా మనం గ్రెగోరియన్ క్యాలెండర్ అనుసరిస్తాం. దీని ప్రకారం డిసెంబర్ 25న క్రిస్మస్, జనవరి 1న న్యూ ఇయర్ వస్తుంది. కానీ స్కాట్లాండ్ లోని ఫౌలా అనే చిన్న ద్వీపం మాత్రం ఇప్పటికీ పాత జూలియన్ క్యాలెండర్ నే పాటిస్తోంది. ఇక్కడ క్రిస్మస్ వేడుకలు జనవరి 6న జరుగుతాయి. ఇక కొత్త ఏడాది వేడుకలు జనవరి 13న నిర్వహిస్తారు. బ్రిటన్ అంతా 1752లోనే క్యాలెండర్ మార్చినా ఈ ద్వీపవాసులు మాత్రం తమ పాత సంప్రదాయాలనే కొనసాగిస్తున్నారు.

రష్యాలో కూడా అదే సీన్!

కేవలం ఫౌలా మాత్రమే కాదు, రష్యా, సైబీరియా, ఇథియోపియా వంటి దేశాల్లో కూడా క్రిస్మస్ వేడుకలు జనవరిలోనే జరుగుతాయి. రష్యాలోని ఆర్థోడాక్స్ చర్చి జూలియన్ క్యాలెండర్‌ను అనుసరిస్తుంది. దీని ప్రకారం జనవరి 7న అక్కడ అధికారికంగా క్రిస్మస్ జరుపుకుంటారు. అంటే ప్రపంచం కొత్త ఏడాదిలో వారం రోజులు గడిపేసిన తర్వాత గానీ వారికి పండుగ రాదు. ఒకవేళ మీరు డిసెంబర్ 25న క్రిస్మస్ మిస్ అయి ఉంటే, లేదా ఆ వేడుకలను మళ్ళీ జరుపుకోవాలని ఉంటే.. ఈ ప్రాంతాలకు వెళ్తే టైమ్ ట్రావెల్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

ఫౌలా ద్వీపంలో కేవలం 30-40 మంది మాత్రమే నివసిస్తారు. ఇక్కడ పండుగ అంటే కేవలం విందులు, వినోదాలు మాత్రమే కాదు.. ఊరంతా ఒకే కుటుంబంలా కలిసి జరుపుకునే ఒక ఆత్మీయ వేడుక. ఇక్కడ నార్న్ అనే పురాతన భాషా ఆనవాళ్లు కూడా కనిపిస్తాయి, ఇది పర్యాటకులకు ఒక విభిన్నమైన ప్రపంచంలోకి తీసుకెళ్లిన అనుభూతినిస్తుంది. ఈ ప్రాంతాల్లో ఉండేవారు రెండుసార్లు క్రిస్మస్, రెండుసార్లు న్యూ ఇయర్ జరుపుకునే అవకాశం ఉంటుంది. మెయిన్ ల్యాండ్ లో ఒకసారి, తమ ద్వీపంలో మరోసారి పండుగ చేసుకుంటారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
పండక్కి ఊరెళ్లేందుకు ట్రైన్‌ టిక్కెట్లు దొరకట్లేదా?
పండక్కి ఊరెళ్లేందుకు ట్రైన్‌ టిక్కెట్లు దొరకట్లేదా?
టీ లవర్స్‌కు గుడ్ న్యూస్! ఈ జపాన్ చాయ్ గురించి తెలుసా?
టీ లవర్స్‌కు గుడ్ న్యూస్! ఈ జపాన్ చాయ్ గురించి తెలుసా?