Telangana: అమ్మ జన్మనిస్తుంది.. పునర్జన్మ కావాలంటే ఇలా చేయాల్సిందే.! దండం పెట్టి మరీ..
ఇదేంటి దండం పెడుతున్నారని అనుకుంటున్నారా.? ఆ అధికారులు ఏం చెబుతున్నారో వింటే మీకు కూడా జ్ఞానోదయం కలుగుతుంది. ఈ ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి మరి. మీకోసమే ఇది.

ఖమ్మం జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. అతి వేగం, మద్యం మత్తు, నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వాహనాలతో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇటీవల జిల్లాలో కాలేజీ బస్సు, ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా కొట్టిన ఘటనల్లో 60 మంది విద్యార్థులకు గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదాలతో లోపాలు బయట పడ్డాయి. దీనితో రవాణా శాఖ అధికారులు, పోలీసులు జిల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ.. అవగాహన కల్పిస్తున్నారు.
అమ్మ జన్మనిస్తుంది. హెల్మెట్, సీట్ బెల్ట్ పునర్జన్మనిస్తుందని హైవేలపై ప్రయాణిస్తున్న వాహనదారులకు దండం పెడుతూ నిబంధనలు పాటించమని కోరుతున్నారు రవాణా శాఖ అధికారులు. రూల్స్ పాటించని వాహనదారులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మొదటి తప్పుగా క్షమించి గులాబీ పువ్వు ఇచ్చి కుటుంబ బాధ్యతలను గుర్తు చేస్తూ రెండోసారి ఉపేక్షించమని హెచ్చరించారు. ప్రధానంగా వాహనం నడిపేటప్పుడు బాధ్యతను మరచి నిర్లక్ష్యంతో సెల్ ఫోన్ మాట్లాడం, మద్యం మత్తు, నిద్ర మత్తులో ఉండడం వల్ల అనేక ప్రమాదాల్లో ఎంతో విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి నడపడం నేరమని ట్రాఫిక్ నిబంధనలు తెలుపుతూ ఆర్టీఏ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
