యూకేలో తెలుగు విద్యార్థిని మృతి.. మృతదేహాన్ని ఇంటికి తీసుకుని వస్తామని మంత్రి కేటీఆర్ హామీ..

సాయి తేజస్విని మృత దేహాన్ని ఇక్కడికి తీసుకురావడానికి తమ కుటుంబం చాలా అధికార సవాళ్లను ఎదుర్కొంటోందని సాయి సోదరి ప్రియారెడ్డి చేసిన ట్వీట్‌పై కేటీఆర్ స్పందించారు. "దయచేసి నా ఆత్మ సోదరికి చివరి కర్మలు చేయడానికి మాకు సహాయం చేయండి" అని ఆమె పోస్ట్ చేసింది.

యూకేలో తెలుగు విద్యార్థిని మృతి.. మృతదేహాన్ని ఇంటికి తీసుకుని వస్తామని మంత్రి కేటీఆర్ హామీ..
Telugu Girl Dies In Uk
Follow us
Surya Kala

|

Updated on: Apr 18, 2023 | 2:49 PM

విదేశానికి చదువు కోసం వెళ్లిన మరో విద్యా కుసుమం మరణించింది. తెలుగమ్మాయి.. సాయి తేజస్విని సముద్రపు ఒడ్డున ఈత కొడుతుండగా పెద్ద అలలు రావడంతో కొట్టుకు పోయింది.  యూకేలోని బ్రైటన్ సముద్రం లో మరణించిన సాయి తేజస్విని వయస్సు ఏళ్లు. కోస్ట్‌గార్డ్‌లు స్పందించి రక్షించే సమయానికి పెద్ద అలలు ఆమెను లోతైన సముద్రంలో లాక్కుపోయాయి. ఒడ్డుకు తీసుకుని వచ్చి సాయి తేజస్వినికి CPR చేసినా స్పందించలేదు. అనంతరం సాయి తేజస్విని చనిపోయినట్లు ప్రకటించారు.

తెలుగు విద్యార్థిని సాయి తేజస్విని మృతదేహాన్నిహైదరాబాద్ తీసుకుని రావడానికి సహాయం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు మంత్రి కేటీ రామారావుకు ట్వీట్  చేశారు. ఈ ట్వీట్ కు మంత్రి కేటీఆర్ స్పందించారు. అవసరమైన సహాయం అందిస్తామని సాయి తేజస్విని కుటుంబానికి హామీ ఇచ్చారు.

“మీ కుటుంబానికి జరిగిన నష్టం తీర్చలేనిది.. తన బృందం @KTRoffice వెంటనే సహాయం చేయడానికి స్థానిక బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ బృందం.. హైదరాబాద్‌తో కలిసి పని చేస్తుంది,” అని పేర్కొన్నారు. సాయి తేజస్విని మృత దేహాన్ని ఇక్కడికి తీసుకురావడానికి తమ కుటుంబం చాలా అధికార సవాళ్లను ఎదుర్కొంటోందని సాయి సోదరి ప్రియారెడ్డి చేసిన ట్వీట్‌పై కేటీఆర్ స్పందించారు. “దయచేసి నా ఆత్మ సోదరికి చివరి కర్మలు చేయడానికి మాకు సహాయం చేయండి” అని ఆమె పోస్ట్ చేసింది. యూకేలో క్రాన్‌ఫీల్డ్ యూనివర్శిటీలో ఏరోనాటిక్స్ , స్పేస్ ఇంజినీరింగ్ మాస్టర్స్  చదువుతోంది సాయి తేజస్వి.  ఆమె కుటుంబ సభ్యులు చెప్పిన ప్రకారం “ఏప్రిల్ 11 న బ్రైటన్ బీచ్‌లో అలలో చిక్కుకుని మరణించింది. అప్పటి నుండి ఆమె శరీరం UK ఆసుపత్రిలో ఉంది.

ఇవి కూడా చదవండి

వాస్తవానికి బ్రైటన్ సముద్రంలో ఇటువంటి దారుణ సంఘటనలు అనేకం గతంలో జరిగాయి. లాంగ్ వీకెండ్ అవడంతో సాయి తేజస్విని విహారానికి వెళ్లినట్టు తెలుస్తుంది. సాయి తేజస్విని స్వస్థలం హైదరాబాద్ లోని సైదాబాద్

UK పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాయి తేజస్విని తో ఎవరెవరు వున్నారు.. ఆమెకి ఈత వచ్చా లేదా ? వివిధ కోణాల నుండి పోలీసులు ధైర్యాప్తు చేస్తున్నారు. ప్రొసీజర్ పూర్తి చేసుకొని ఆమె శరీరాన్ని ఇండియాకి తీసుకురావడానికి ఆమె బంధువులు ఫండ్ రైజ్ చేస్తున్నారు.. ఫండ్ రైసింగ్ కి కూడా మంచి స్పందన వచ్చింది ,

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్