Turkey Earthquake: ఏడంతస్తుల హోటల్‌ శిథిలాల్లో చిక్కుకున్న 32 మంది క్రీడాకారులు.. టీచర్, విద్యార్థి మృతదేహాలు వెలికితీత

శిథిలాల తొలగింపును రెస్క్యూ టీమ్‌లు వేగవంతం చేశారు. మంచు వర్షంతో అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ తమ సేవలు కొనసాగిస్తున్నారు. ఇక రెండు దేశాల్లో దాదాపు లక్షా 10వేల మందికి పైగా సహాయకచర్యల్లో పాల్గొంటున్నారు.  

Turkey Earthquake: ఏడంతస్తుల హోటల్‌ శిథిలాల్లో చిక్కుకున్న 32 మంది క్రీడాకారులు.. టీచర్, విద్యార్థి మృతదేహాలు వెలికితీత
Turkey Volleyball Team
Follow us
Surya Kala

|

Updated on: Feb 11, 2023 | 8:28 AM

టర్కీ, సీరియల్లో భూకంపం సృష్టించిన విధ్వసంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది గాయాలు పాలయ్యారు. కోట్లమంది నిరాశ్రయులయ్యారు. గత ఆరు రోజులుగా సహాయకార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. శిథిలాలను తవ్వే కొద్దీ వంద గంటల తర్వాత కొందరు సజీవంగా బయటకు వచ్చారు. టర్కీలోని దియార్‌బకీర్‌ అనే పట్టణంలో 36 ఏళ్ల వ్యక్తిని రక్షించారు. ఇక ఆదియామన్‌ అనే పట్టణంలోఒక తల్లి, ఆమె కొడుకును బయటకు తీసుకువచ్చారు. దీంతో శిథిలాల తొలగింపును రెస్క్యూ టీమ్‌లు వేగవంతం చేశారు. మంచు వర్షంతో అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ తమ సేవలు కొనసాగిస్తున్నారు. ఇక రెండు దేశాల్లో దాదాపు లక్షా 10వేల మందికి పైగా సహాయకచర్యల్లో పాల్గొంటున్నారు.

మరోవైపు హోటల్‌ శిథిలాల కింద రెండు వాలీబాల్‌ క్రీడాకారుల బృందాలు చిక్కుకొన్న వార్తలు వస్తున్నాయి. బాలురు, బాలికలతో కూడిన ఆటగాళ్ల బృందం ఏడంతస్తుల హోటల్‌ శిథిలాల్లో చిక్కుకుపోయింది. ఇప్పటి వరకు అక్కడ ఇద్దరు టీచర్లు, ఓ విద్యార్థి మృతదేహాన్ని వెలికి తీశారు. ఇంకా 32 మంది క్రీడాకారులు ఇప్పటికీ శిథిలాల మధ్యే ఉన్నారు. దీంతో యూరోపియన్ పుడ్‌బాల్ లీగ్ సందర్భంగా శని, ఆదివారంతో పాటు సోమవారం జరిగే అన్ని మ్యాచ్‌ల్లో.. ఒక నిముషం పాటు ఆటగాళ్లు మౌనం పాటిస్తారని FIGC తెలిపింది. ఇటలీ, ఇంగ్లాండ్, స్పెయిన్,ప్రాన్స్, జెర్మనీ దేశాల ఆటగాళ్లు మౌనం పాటిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..