North Korea: ఆర్మీ వార్షికోత్సవ వేడుకలకు భార్య, కూతురితో కిమ్ హాజరు.. ప్రత్యేక ఆకర్షణగా కిమ్ భార్య మిస్సైల్ నెక్లెస్‌

బాంక్వెట్‌కు .. కిమ్ తన ఫ్యామిలీతో విందులో పాల్గొన్నారు. కిమ్ కూతురు పేరు జూ యే. ఆమె వ‌య‌సు తొమ్మిదేళ్లు. భార్య రీ సోల్ జూ కూడా విందులో పాల్గొన‌డం విశేషం. ఈ విందుకు రి సోల్-జు ధరించిన నెక్లెస్, కిమ్ కుమార్తె ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

North Korea: ఆర్మీ వార్షికోత్సవ వేడుకలకు భార్య, కూతురితో కిమ్ హాజరు.. ప్రత్యేక ఆకర్షణగా కిమ్ భార్య మిస్సైల్ నెక్లెస్‌
Kim Jong Un's Wife
Follow us
Surya Kala

|

Updated on: Feb 10, 2023 | 12:22 PM

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ గత కొన్ని రోజులుగా కనిపించడంలేదు.. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని వార్తలకు చెక్ పెట్టాడు కిమ్. ముఖ్యంగా ఉత్తర కొరియాలో జరుగుతున్న కొరియన్ పీపుల్స్ ఆర్మీ 75వ వార్షికోత్సవ వేడుకలకు హాజరుకాకపోవడంతో కిమ్ ఆరోగ్యంపై రకరకాల పుకార్లు షికారు చేశాయి. ఏకంగా అమెరికాలోని ఓ ప్రముఖ మీడియా సంస్థ కిమ్ ఆరోగ్యం అత్యంత విషమం అంటూ ఓ కథనం కూడా ప్రసారం చేసింది. అయితే అందరికి షాక్ ఇస్తూ.. ప్యోంగ్యాంగ్‌లో బుధవారం రాత్రి ఆర్మీ నిర్వహించిన పరేడ్‌లో కిమ్ తన భార్య, కుమార్తెతో కలిసి పాల్గొన్నాడు. మిల‌ట‌రీ విందుకు కిమ్ భార్య రీ సోల్ జూ, ఆయన కుమార్తె జూ యే కూడా హాజరయ్యారు.

చాలా విలాస‌వంతంగా జ‌రిగిన బాంక్వెట్‌కు .. కిమ్ తన ఫ్యామిలీతో విందులో పాల్గొన్నారు. కిమ్ కూతురు పేరు జూ యే. ఆమె వ‌య‌సు తొమ్మిదేళ్లు. భార్య రీ సోల్ జూ కూడా విందులో పాల్గొన‌డం విశేషం. ఈ విందుకు రి సోల్-జు ధరించిన నెక్లెస్, కిమ్ కుమార్తె ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కిమ్ జోంగ్ ఉన్ భార్య క్షిపణి నెక్లెస్ పెండెంట్ ను ధరించి కనిపించింది. మరోవైపు కిమ్ తన తాత.. ఉత్తర కొరియా వ్యవస్థాపక నాయకుడు కిమ్ ఇల్ సంగ్ ఇష్టపడే నల్ల కోటు,ఫెడోరా కలయికను ధరించి కనిపించాడు. అణు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను ప్రదర్శించే పరేడ్‌ను కిమ్ పర్యవేక్షించారు.

కూతురుతో క‌లిసి కిమ్ విందుకు హాజ‌రుకావడం మిలిట‌రీ అధికారుల్ని ఆశ్చ‌ర్యానికి గురి చేసిన‌ట్లు స్థానిక మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. కిమ్ ఫ్యామిలీ విందుకు వ‌స్తున్న ఫోటోల‌ను స్థానిక రోడాంగ్ సిన్‌మున్ ప‌త్రిక ప్ర‌చురించింది. అంతేకాదు ఈ వేడుకల్లో బాంక్వెట్‌లో టేబుల్ సెంట‌ర్ సీటులో కిమ్ త‌న కూతుర్ని కూర్చోబెట్టారు. దీంతో ఆమె దేశానికి భవిష్యత్ నాయకురాలు అనే ఊహాగానాలకు ఊపిరి పోసినట్లు అయింది. మిలిట‌రీ ఈవెంట్‌కు కూతుర్ని తీసుకువ‌చ్చి.. రాచ‌రిక పాల‌న సంకేతాన్నీ కిమ్ ఇచ్చాడని  నిపుణులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వాస్తవానికి కిమ్ తన వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచుతారు. కుటుంబంతో కలిసి బయట కనిపించడం అరుదు. ఇప్పుడు వేడుకల్లో పాల్గొన్న కిమ్ కుమార్తె జూ యే… ఇలా ప్రపంచం ముందు కనిపించడం ఇది రెండోసారి మాత్రమే. కొంతకాలం కిందట జరిగిన ఓ మిసైల్‌ పరీక్షకు కుమార్తెతో కలిసి కిమ్ హాజరు అయ్యారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..